ఒంగోలు బ‌రిలో జ‌గ‌న్ వ‌దిలిన బాణ‌మే పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and ys sharmila
Updated:  2018-08-28 15:17:51

ఒంగోలు బ‌రిలో జ‌గ‌న్ వ‌దిలిన బాణ‌మే పోటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఏపీలో వైసీపీ-టీడ‌పీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఇక దీనికి తోడు ఇలీవ‌లే జ‌న‌సేన పార్టీ యాడ్ కావ‌డంతో ఏపీ రాజ‌కీయాలు మ‌రింత హాట్ హాట్ గా సాగుతున్నారు. అయితే రాష్ట్ర‌ రాజ‌కీయాలు ప‌క్క‌న పెడితే ఒంగోలు రాజ‌కీయాలు ప్ర‌త్యేకం. 
 
ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈయ‌న కొద్ది రోజుల క్రితం రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా త‌మ‌దే విజ‌యం అని ధీమా వ్వ‌క్తం చేస్తున్న వైవీ ఆయ‌న స్థానంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, చెల్లెలు వైఎస్ ష‌ర్మిలను భ‌రిలో దింప‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నారు. 
 
ఒంగోలు పార్ల‌మెంట్ సామాజికవర్గ ప‌రిధిలో రెడ్డి సామాజిక వ‌ర్గంతో పాటు ఎస్సీ, ముస్లి ఓటు బ్యాంక్ అభ్య‌ర్థుల గెలుపు ఓట‌మిల‌ను నిర్ణ‌యిస్తారు. అయితే గ‌త ఎన్నిక‌లో ఈ వ‌ర్గాల‌న్ని వైసీపీ వైపు చూడ‌టంతో వైసీపీ అత్య‌ధిక ఓట్ల‌తో విజ‌యం సాధించింది. 
 
ఒక పోతే ఒంగోలులో అత్య‌ధికంగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే అంశం వెలిగొండ ప్రాజెక్ట్  అయితే ఈ ప్రాజెక్ట్ మొద‌టి ట‌ర్నెల్ ప‌నిని ఎన్నిక‌లు దగ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు వేగంగా పూర్తి చేసి సంక్రాంతి క‌ల్లా నీరు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అయితే ఇదే క‌నుక జ‌రిగి వైసీపీకి బ‌లంగా ఉన్న ఎర్న‌గొండు పాళెం, మార్కాపురం, గిద్ద‌లూరు, క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గ్రాఫ్ కొద్ది మేర‌కు పెరుగుతుంద‌న్న ఉద్దేశంతో  ఉన్నారు టీడీపీ నాయ‌కులు. 
 
ఇక ఈ ప‌రిస్థితికి చెక్క పెట్టేందుకు వైసీపీ యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేసింద‌ట‌. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పిన హామీలో నిజం లేద‌ని సంక్రాంతి పండుగనాటికి ప్రాజెక్ట్ ప‌నులు పూర్తి కాద‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఇక ఇదే క్ర‌మంలో క‌నిగిరినుంచి వెలిగొండ ప్రాజెక్ట్ దాక పాద‌యాత్ర‌కు సై అన్న వైవీ సుబ్బారెడ్డి సంక్రాంతికి నీళ్లు ఇస్తామ‌న్న టీడీపీ మాట‌ల్లో నిజంలేదంటూ ప్ర‌చారం చేస్తున్నారు. 
 
అయితే టీడీపీ ఒంగోలు పార్ల‌మెంట్ ప‌రిధిలో ఎట్టిప‌రిస్థితిలోను  సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌కూడ‌దు అని భావిస్తున్న వైసీపీ అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైవీ సుబ్బారెడ్డి స్థానంలో వైఎస్ ష‌ర్మిల‌ను భ‌రిలోకి దింపాల‌ను బావిస్తున్నార‌ట‌. ఇక వైవీసుబ్బారెడ్డి కూడా ష‌ర్మిల పోటీ చేస్తే తాను త‌ప్పుకుని రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌డానికి సుముఖ‌త చూపుతున్నార‌ట‌. 
 
తాను జ‌గ‌న్ వ‌దిలిన భాణాన్ని అంటూ ఉమ్మ‌డి ఏపీలో పొలిటిక‌ల్ స్క్రీన్ మీద‌కు వ‌చ్చిన ష‌ర్మిల ఇప్ప‌టిదాక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు.ఇక ఇప్పుడు ఆమే ఒంగోలు నుంచి పోటీకి సై అంటే అటు డీడీపీ ఎలాంటి ఎత్తుల‌కు ప‌దును పెదుతుందో అన్న‌ది చ‌ర్చ‌నీయ‌శంగా మార‌నుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.