రంగంలో కి ష‌ర్మిల

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-05 17:27:46

రంగంలో కి ష‌ర్మిల

వైయ‌స్ ఫ్యామిలీ రాజ‌కీయంగా క‌డ‌ప జిల్లాలో నాలుగుద‌శాబ్దాలుగా తిరుగులేని విజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకుంది.. ఇక తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆ రికార్డులను తిర‌గ‌రాయాలి అని అనుకుంది... దానికి అనుగుణంగా సీఎం చంద్ర‌బాబు జిల్లా నాయ‌కుల‌తో ముందుకు న‌డిచారు..పార్టీ మారే నాయ‌కులు ఎవ‌రు అని చూస్తే? .జిల్లాలో బ‌ద్వేల్ ఎమ్మెల్యే జ‌య‌రాములు అలాగే జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి పార్టీ మారారు... దీంతో మంత్రిగా ఆదినారాయ‌ణ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించారు.... వైసీపీ జిల్లాలో తిరుగులేని విజ‌యం సాధించ‌డంతో ఇక్క‌డ తెలుగుదేశం ఫిరాయింపుల‌కు పాల్ప‌డింది.
 
అయితే జిల్లా తెలుగుదేశం బాధ్య‌త‌లు కూడా మంత్రి ఆదినార‌య‌ణ రెడ్డి చూసుకుంటున్నారు... ఇక ఎమ్మెల్సీ టికెట్ బీటెక్ ర‌వికి ఇప్పించి ఆ విజ‌యంతో వైయ‌స్ ఫ్యామిలీని ఓడించాము అని చాటిచెప్పారు ఆదినారాయ‌ణ రెడ్డి... అయితే త‌ర్వాత ఎక్క‌డ చూసినా తెలుగుదేశం ఆశ‌లు చిగురించేలా క‌నిపించ‌డం లేదు జిల్లా రాజ‌కీయాల్లో .. ఇక్క‌డ ఆదినారాయ‌ణ రెడ్డి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన వెంటనే మాజీ మంత్రి తెలుగుదేశం జ‌మ్మ‌ల‌మ‌డుగు ఇంచార్జ్ రామ‌సుబ్బారెడ్డి తెలుగుదేశం నుంచి పార్టీ మార‌తారు అని అనుకున్నారు అంద‌రూ.
 
రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డంతో రామ‌సుబ్బారెడ్డి కూడా ఎమ్మెల్సీగా కొన‌సాగుతూ కాస్త వెన‌క‌డుగువేస్తున్నారు ఇక్క‌డ సెగ్మెంట్ రాజ‌కీయాల్లో. ఇటీవ‌ల  చంద్ర‌బాబు ఇరువురికి స‌యోధ్య కుదిర్చారు అర్ద‌రూపాయి వాటాల‌ను పంప‌కాలుగా చేశారు అని  మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి చెప్పారు.
 
అయితే జ‌మ్మ‌లమ‌డుగు నుంచి సుధీర్ రెడ్డి వైసీపీ త‌ర‌పున ఇంచార్జ్ గా ఉన్నా, జిల్లాలో కీల‌క‌మైన సెగ్మెంట్ కావ‌డంతో ఇక్క‌డ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డిపై పోటికి కొత్త అభ్య‌ర్దిని నిల‌బెట్టాల‌ని వైసీపీ అధిష్టానం ముందు నుంచి అనుకుంటోంది అని అంటున్నారు.. అలాగే ఇక్క‌డ నుంచి వైయ‌స్ విజ‌య‌మ్మ‌ను లేదా వైయ‌స్ ష‌ర్మిల‌ను రంగంలోకి దింపాలి అని  ముందు నుంచి అనుకున్నారు.
 
కాని క‌డ‌ప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని  జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి నిల‌బెట్టి సోద‌రి ష‌ర్మిల‌ను క‌డ‌ప ఎంపీగా నిల‌బెట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి... అవినాష్ రెడ్డి లేదా వివేకానంద‌రెడ్డి జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది అని ఇప్ప‌టికే ఇక్క‌డ జ‌మ్మ‌ల‌మ‌డుగులో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇక ఎంపీగా ష‌ర్మిల నిల‌బ‌డితే క‌చ్చితంగా గెలుపు ఖాయం అంటున్నారు నాయ‌కులు. అయితే ఇటు విజ‌య‌మ్మ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతారు అని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం లేదు అంటున్నారు నాయ‌కులు జిల్లా వైసీపీ శ్రేణులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.