ఢిల్లీకి వైఎస్‌ విజయమ్మ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys vijayamma ysrcp mps
Updated:  2018-04-07 06:14:45

ఢిల్లీకి వైఎస్‌ విజయమ్మ

ఏపీకి ప్ర‌త్యేకహోదా ప్ర‌క‌టించాలంటూ దిల్లీ ఏపీ భ‌వ‌న్‌లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే...ఈ దీక్ష‌కు అనేక మంది నాయ‌కులు మ‌ద్ద‌తు తెలిపారు. తాజాగా వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష‌కు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సంఘీభావం తెల‌ప‌డానికి దిల్లీకి వెళ్ల‌నున్నారు. త‌మ ప‌ద‌వుల‌ను త్యాగం చేసి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేస్తున్న పార్టీ ఎంపీలను అభినందించ‌నున్నారు.
 
అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి వైఎస్‌ విజయమ్మ పరామర్శించనున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉండ‌డం వ‌ల్ల పార్టీ ప్ర‌తినిధిగా ఎంపీల దీక్ష‌ను సంద‌ర్శించ‌నున్నారు విజయమ్మ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.