వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ధ‌ర్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-08-25 02:32:45

వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ధ‌ర్నా

వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో సీకే దిన్నె పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద తాజాగా ఉద్రిక్త‌త నెల‌కొంది. ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకున్నార‌నే ఉద్దేశంతో అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘాల‌న నేత‌ల‌ని విడుద‌ల చెయ్యాలంటూ ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ర‌వీంద్ర‌నాథ్ రెడ్డిలు స్టేష‌న్ వద్ద ధ‌ర్నాకు దిగారు. 
 
కార‌ణం లేకుండా విద్యార్థి సంఘాల నాయ‌కుల‌ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేయ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నించారు. ఈ అరెస్ట్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌క్రమంగా ఆయ‌న ప్ర‌క‌టించిన హామీల‌ను అమలు చేస్తే విద్యార్థి సంఘాల నాయ‌కులు ఎందుకు ధ‌ర్నాలు చేస్తార‌ని వారు మండిప‌డ్డారు. అరెస్ట్ చేసిన వ్య‌క్తుల‌ను వెంట‌నే విడుద‌ల చెయ్యాల‌ని వారు డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.