చరిత్ర సృష్టించిన వైయ‌స్ఆర్‌సీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp parliament
Updated:  2018-04-02 11:31:33

చరిత్ర సృష్టించిన వైయ‌స్ఆర్‌సీపీ

రాష్ట్ర అభివృద్దికి కంక‌ణం క‌ట్టుకున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక‌పోయినా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ నాలుగు సంవ‌త్స‌రాలుగా నిర్విరామంగా పోరాటం చేస్తోంది. ప్ర‌త్యేక‌హోదా పై కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష వైఖ‌రికి వ్య‌తిరేకంగా పార్ల‌మెంట్‌లో మొద‌ట‌గా అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తొమ్మిదోసారి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరుతున్నారని తెలిపారు. కేంద్రం పై అవిశ్వాస తీర్మానానికి  మద్ధతుగా వంద మంది ఎంపీలను కూడగట్టామని తెలిపారు. పార్ల‌మెంట్‌లో  నేడు చర్చ చేపట్టాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మ‌హాజ‌న్ కు విజ్ఞప్తి చేశారు. 
 
అవిశ్వాస తీర్మానానికి ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ  చర్చ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు. నేటి నుంచి చివరిరోజు వరకు పార్టీ ఎంపీలందరూ సభకు హాజరు కావాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  విప్ జారీ చేసిన‌ట్లు తెలిపారు. పార్టీ ఆదేశాల మేర‌కే స‌భ‌లో న‌డుచుకోవాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం  వైసీపీ ఎంపీలు రాజీనామాలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి అని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. 
 
ఏపీకి కేంద్రం ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌క‌పోవ‌డానికి తెలుగుదేశం పార్టీ అస‌మ‌ర్ద‌తే కార‌ణం అని అన్నారు. నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో క‌నీసం  ఒక్క‌సారైనా  ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం చేసి ఉంటే ఫ‌లితం వేరుగా ఉండేద‌ని ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ అన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి దిల్లీ ప‌ర్య‌ట‌న కేవ‌లం రాజ‌కీయ ల‌బ్దికేస‌మే అని ఆయ‌న‌ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.