ఆ వ‌ర్గాల ఓట్ల పై ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 12:38:10

ఆ వ‌ర్గాల ఓట్ల పై ప్లాన్

వైసీపీ అధినేత జ‌గ‌న్ వేసే పొలిటిక‌ల్ స్ట్రాట‌జీలు తెలుగుదేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టీడీపీ ఎటువంటి కొత్త  ఆక‌ర్ష‌ణ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు ప్ర‌వేశ‌పెట్టినా, గ‌తంలో ఇచ్చిన హామీల గురించి తెలుగుదేశం నాయ‌కుల‌ను జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. చెప్పిన‌వి చేశాం చెప్ప‌నివి చేశాం అని స‌భ‌ల్లోచెప్ప‌డం కాదు, గ‌తంలో ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు అని నిల‌దీస్తున్నారు ప్ర‌జ‌లు.
 
ఇక బీసీలు తెలుగుదేశానికి ఎంతో బ‌ల‌మైన వ‌ర్గీయులు చెప్ప‌చ్చు. అయితే కాపు సామాజ‌కి వ‌ర్గం కూడా అలాగే తెలుగుదేశం వైసీపీకి మ‌ద్ద‌తు స‌రిస‌మానంగా ఇస్తోంది. ఇప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్లు బీసీల మ‌ధ్య చిచ్చు ర‌గిల్చేలా ఉన్నాయి. అయితే జ‌గ‌న్ మాత్రం ప్ర‌తీ సామాజిక‌వర్గాన్ని త‌న నిర్ణ‌యాల‌తో హామీల‌తో క‌లుపుకుపోతున్నారు.మ‌రీ ముఖ్యంగా బీసీల‌కు మ‌రింత ప్రాధాన్యత ఇస్తామ‌ని చెబుతున్నారు జ‌గ‌న్. ప్ర‌త్యేకంగా వారికి కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌తీ కులానికి హామీ ఇచ్చుకుంటూ వెళుతున్నారు జ‌గ‌న్.
 
ఇప్ప‌టికే ఓసీలో అన్ని కుల‌లాకు కార్పొరేష‌న్ల పై ప్ర‌క‌ట‌న చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ప్ర‌తిప‌క్ష నేత‌. అలాగే తెలుగుదేశం చేయ‌ని ప‌నులు అన్ని పూర్తి అవుతాయ‌ని చట్టస‌భ‌ల్లో బీసీల‌ను  మ‌రింత  అంద‌లం ఎక్కిస్తామంటున్నారు జ‌గ‌న్.జ‌గ‌న్ క‌ర్నూలు జిల్లాలో పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో బీసీల‌కు ఇక్క‌డ ఎంపీ సీటు ఇస్తాను అన్నారు. నేత‌న్న‌ల‌కు సాయం చేస్తాను అన్నారు.. ఇటు కోస్తాలోకి వ‌చ్చిన స‌మ‌యంలో ఎమ్మెల్సీ అవ‌కాశాలు కూడా బీసీల‌కు ఇస్తాను అని జ‌గ‌న్ తెలియ‌చేశారు. అలాగే వ‌డ్డెర‌ల‌కు ఎమ్మెల్సీ ఇస్తాను అన్నారు. ఇక మెజార్టీ ఉన్న బీసీల విద్యార్దుల‌కు మంచి చ‌దువులు చ‌దివిస్తాము అని తెలియ‌చేశారు. 
 
మొత్తానికి బీసీ ఓటు బ్యాంకు అంటే అంద‌రూ చెప్పేది తెలుగుదేశం స‌ర్కారు పేరు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం ఓటు బ్యాంకును జ‌గ‌న్ కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అనేది తెలుస్తోంది ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు  తెలుగుదేశానికి పొలిటిక‌ల్ గా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఇప్ప‌టికే కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం పై కక్క‌లేక మింగ‌లేక ఉంది అధికార పార్టీ. ఇటు గోదావ‌రి జిల్లాలో కూడా కాపు ఓట‌ర్లు బ‌లంగా ఉన్నారు. జ‌గ‌న్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీ ఓటు బ్యాంకుతో పాటు కాపు ఓటు బ్యాంకు కూడా మ‌రింత మ‌ల్లుతుంది అని అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.