వైసీపీ మ‌రో ప్రోగ్రాం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-23 01:32:55

వైసీపీ మ‌రో ప్రోగ్రాం ?

రాజ‌కీయ పార్టీల‌కు అధికార‌మే అంతిమ ల‌క్ష్యం. అందుకోసం ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి అనేక హ‌మీలు ప్ర‌క‌టిస్తుంటాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల వేళ‌ ఓటు బ్యాంకు ఎక్కువుగా ఉన్న‌ సామాజిక వ‌ర్గాల‌కు ప్ర‌త్యేకించి ఆక‌ర్షిస్తారు.. అలాగే అంద‌రికంటే వారికి అద‌న‌పు హ‌మీలు గుప్పిస్తుంటాయి రాజ‌కీయ పార్టీలు.పార్టీల‌ను న‌డిపే నాయ‌కులు.
 
ప్ర‌స్తుతం ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ మ‌ధ్య రాజ‌కీయ కురుక్షేత్రం ఇప్ప‌టి నుంచే  మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది, ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రంలో..ఇప్ప‌టికే అధికారంలో ఉన్న టీడీపీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలిచేందుకు వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగానే ఒక్కో సామాజిక వ‌ర్గానికి కార్పొరేష‌న్  ఏర్పాటు చేసి ఆర్థికంగా స‌హ‌యం అందిస్తోంది. 
 
అందులో ప్ర‌ధానంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి ద‌ళిత తేజం-తెలుగు దేశం అనే కొత్త‌ ప‌థ‌కాన్ని ప్రారంభించింది తెలుగుదేశం.. ఈ కార్య‌క్ర‌మం ద‌ళిత వ‌ర్గాల వారి అభ్యున్న‌తికి పాటుప‌డాల‌నే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశాము అని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు....  ముఖ్యంగా ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల చేత ఈ ప‌ధ‌కాన్ని ప్ర‌జల్లోకి మ‌రింత ఎక్కువ‌గా తీసుకువెళ్లాల‌ని చంద్ర‌బాబు ఉద్దేశ్యం.. కాని క్షేత్ర‌స్ధాయిలో నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మాన్ని తీసుకువెళ్ల‌డంలో అంత చొర‌వ చూప‌డం లేదుఅనే మాట‌లు వినిపిస్తున్నాయి.
 
దీనికి భిన్నంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ ద‌ళిత గ‌ర్జ‌న‌ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు..... ద‌ళితుల‌ను చేర‌దీసి వారికి పార్టీలో అవ‌కాశాలు ఇవ్వ‌డం దీని ప్ర‌ధాన ల‌క్ష్యం... త్వ‌ర‌లో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు వైయ‌స్ జ‌గ‌న్‌. అయితే దీన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డానికి  పార్టీ మొత్తం కృషి చేయాల‌ని జ‌గ‌న్ తెలియ‌చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.