జ‌గ‌న్ జాత‌కాన్ని మార్చేది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-28 18:11:40

జ‌గ‌న్ జాత‌కాన్ని మార్చేది

15 సెగ్మెంట్లు రెండు ఎంపీ సెగ్మెంట్లు క‌లిగిన జిల్లా..
 
2014 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వైసీపీ అధినేత‌కే  కాదు వైసీపీ రాష్ట్ర కేడ‌ర్ కు నిరుత్సాహం ఇచ్చిన జిల్లా... 175 సెగ్మెంట్ల‌లో జ‌గ‌న్ 67 స్ధానాలు గెలుచుకుంటే ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోక‌పోవ‌డం అస‌లు జ‌గ‌న్ కే ఓ పెద్ద ఆలోచ‌న‌గా మారింది.... మంచి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది అనుకుంటే అదే ముంచింది జిల్లాలో.. అయితే జిల్లా రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన నాయకులు ఎవ‌రూ 2014 ఎన్నిక‌ల్లో గెలువ‌లేదు... జ‌స్ట్ ఎంట్రీ ఇచ్చిన నాయ‌కులు గెలిచారు, అయితే ఆ ఎంట్రీ లెవ‌ల్ నాయ‌కుల పై కూడా వైసీపీ ప్ర‌భావం చూప‌లేక‌పోయింది అనేది ఇక్క‌డ వినిపించే విమ‌ర్శ‌..
 
పైగా జ‌గ‌న్ కు గోదావ‌రి జిల్లాల నుంచి స‌రైన స‌మాచారం లేదు అని చివ‌ర‌కు పార్టీ పోస్టుమార్టం తేల్చేసింది. అయితే ఎక్క‌డ పొగొట్టుకున్నామో అక్క‌డే తిరిగి సంపాదించాలి అని అక్క‌డ అన్ని సెగ్మెంట్ల‌లో ఇంచార్జ్ ల‌ను నియ‌మించి పార్టీ త‌ర‌పున ముందుకు వెళుతున్నారు జ‌గ‌న్.. వ‌ర్గ‌పోరుకు చెక్ పెట్టారు అలాగే పార్టీ నాయ‌కుల‌కు  ప‌ది రోజుల ముందు వారం ముందు కొన్ని సెగ్మెంట్ల‌లో అభ్య‌ర్దుల‌ను జ‌గ‌న్ ప్ర‌క‌టించడం ఇక్క‌డ పార్టీకి దెబ్బ‌కొట్టింది అని నాయ‌కుల వాద‌న‌..
 
అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగింది వేరు ఇప్ప‌టి నుంచి జ‌రిగేది వేరు...  తెలుగుదేశం కంచుకోట‌గా కృష్ణా గుంటూరును చెబుతారు... అయితే 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఉభ‌య‌గోదావరి జిల్లాలో అద్బుత‌మైన మెజార్టీ అలాగే ప‌శ్చిమ‌లో క్లీన్ స్వీప్ చేయ‌డంతో ఇక్కడ వైసీపీకి చాలా ఎదురుదెబ్బ త‌గిలింది..
 
అయితే జ‌గ‌న్ ఇప్పుడు కృష్ణా నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు ...ఎంట్రీ ఎంట్రీ ఏ దెందులూరులో చింత‌మ‌నేని సెగ్మెంట్ అని చ‌ర్చ‌లు అప్పుడే జ‌రుగుతున్నాయి... ఇక అబ్బ‌య్య చౌద‌రి వ‌ర్సెస్ చింత‌మ‌నేని అని ఇప్ప‌టి నుంచే ఇక్క‌డ పొలిటిక‌ల్ వార్ స్టార్ట్  అయింది... అయితే ఒక్క సెగ్మెంట్ కూడా విజ‌యం సాధించ‌లేదు ఈ జిల్లాలో.. పార్టీ ప‌రిస్దితి ఎక్క‌డ బాగుంది ఎక్క‌డ బాగోలేదు అనేది వైసీపీ అండ్ ప్ర‌శాంత్ టీం ఆలోచించింది..
 
ఆ విధంగా వైసీపీ మెజార్టీ ఆయా సెగ్మెంట్ల గుండా పాద‌యాత్ర ప్లాన్ రూపొందిస్తున్నారు.. ఇక ఇక్క‌డ నుంచి తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి ఉత్త‌రాంధ్రాలోకి ఎంట్రీ ఇస్తారు జ‌గ‌న్.. ఇక్క‌డ ఏఏ సెగ్మెంట్ల పై జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌నున్నారా అని తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలు అప్పుడే ఆలోచ‌న‌లో ప‌డ్డారు.. ఇటు వైసీపీ ఇంచార్జ్ లు కూడా త‌మ సెగ్మెంట్ల గుండా జ‌గ‌న్ పాద‌యాత్ర వెళ్లాలి అని కోరుకుంటున్నారు. 
 
మ‌రి జ‌గ‌న్ కు నిజంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ జిల్లా జాత‌కాన్నే మార్చేయ‌నుంది... ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీలతో ఇక్క‌డ ఎవ‌రూ విజ‌యం చెందలేదు తెలుగుదేశం త‌ర‌పున‌....అలాగే కాపు ఓట‌ర్లు అంద‌రూ ఇప్పుడు జ‌గ‌న్ కా ప‌వ‌న్ కా అనే ఆలోచ‌న‌కు వ‌చ్చారు, కాపు ఓట్లు తెలుగుదేశానికి ఈసారి ప‌డ‌తాయా అనేది ఆలోచ‌న‌గానే ఉంది. ఈ జిల్లాలో కాపు ఓట‌ర్లే పార్టీల భ‌విత‌వ్యాన్ని తేల్చుతారు అన‌డంతో అతిశ‌యోక్తి లేదు ఉదాహ‌ర‌ణ కొల‌మానం గ‌త ఎన్నిక‌లే సాక్ష్యం!!
 
విశ్లేష‌ణ !! గ‌ణేష్ .వి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.