వైసీపీ - జ‌న‌సేన దోస్తీకి సై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and janasena
Updated:  2018-08-22 11:10:01

వైసీపీ - జ‌న‌సేన దోస్తీకి సై

ఏపీలో హోరా హోరీగా జ‌రిగే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో అన్న సంకేతాలు ప్ర‌తీ ఒక్క‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. అధికార‌ తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందోన‌ని ప్ర‌జ‌లు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. 
 
అయితే ఇదే క్ర‌మంలో వైసీపీ మాజీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాధ్ రావు ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో జ‌న‌సేన పార్టీ వైసీపీలు క‌లుసుకుని 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ త‌న అన్న జిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు ఆయ‌న ఒక విజ‌న్ తో ప‌ని చేశార‌ని వ‌ర‌ప్ర‌సాద్ తెలిపారు. 
 
తాను గతంలో పీఆర్పీ నుంచి ఎంపీగా తిరుప‌తిలో పోటీ చేసిన‌ప్పుడు ప‌వ‌న్ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన తీరును తాను ద‌గ్గ‌రుండి గ‌మ‌నించాన‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆయ‌న ఎప్పుడు ప్ర‌జ‌ల కోసం ఏదో చెయ్యాల‌నే ఆలోచ‌న‌లో ఉంటార‌ని తెలిపారు. 
 
వైసీపీలో తాను విశ్వాసంగా ప‌నిచేస్తున్నాన‌ని తెలిపారు. ప్ర‌త్యేక హోదాకోసం పార్టీ అధినేత జ‌గ‌న్ కోరిక మేర‌కు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసినందుకు గ‌ర్వంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నికల్లో తాను ఖ‌చ్చితంగా వైసీపీ త‌ర‌పున తిరుప‌తిలో పోటీ చేస్తాన‌ని అన్నారు. 2019లో చంద్ర‌బాబు నాయుడు దుర్మార్గ‌పు ప‌రిపాల‌న అంతం చేస్తామ‌ని వ‌ర‌ప్రాసాద్ రావు పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.