పొర‌పాటు ఎక్కడ జ‌రుగుతోంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 12:15:30

పొర‌పాటు ఎక్కడ జ‌రుగుతోంది

గ‌త ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ నెగ్గి న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన మంత్రి కావ‌డంలో  కీల‌క పాత్ర పోషించిన సోష‌ల్ మీడియా రానున్న రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించ‌నుందో అంద‌రికి తెలుసు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల‌కు,  ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు మ‌ధ్య సోష‌ల్ మీడియాలో మినీ యుద్ద‌మే జ‌రుగుతోంది. 
 
ముఖ్యంగా ఏపీ విష‌యానికి వ‌స్తే అధికార, ప్ర‌తిప‌క్షాలు సోష‌ల్ మీడియాలో ఎవ‌రికి వారే పోటీ  అని చెప్ప‌డంలో ఏమాత్రం సందేహం లేదు.  టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న సుధీర్ఘ రాజ‌కీయ జీవితంలో మీడియా మేజేమెంట్ ను ఎంత బ‌లంగా వాడుకున్నారో అంద‌రికీ తెలిసిందే. 
 
ఇప్పుడు  ఏపీలో మెజారిటీకి పైగా మీడియా సంస్ధ‌లు అధికార పార్టీ అనుకూల మీడియాగానే కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌తిపక్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున స‌పోర్ట్ ఇస్తూనే ఉన్నారు. కాని ఎక్క‌డో  చిన్న లోపం ఉంద‌నే చెప్పాలి. 
 
తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా వ‌ర్క్ షాప్ పేరిట ప్ర‌తి జిల్లాల్లో  పెద్ద ఎత్తున  కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.  ప్ర‌తి నియోజ‌ర్గంలోని మండ‌ల స్ధాయి నుండి సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న వారిని ఈ వ‌ర్క్ షాప్ కు ఆహ్వానించారు. ఈ స‌మావేశంలో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను  సోష‌ల్ మీడియా ద్వారా  ప్ర‌జ‌ల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి,  ప్ర‌త్య‌ర్దుల‌పై ఎలా బుర‌ద జ‌ల్లాలి అనే విష‌యాల‌పై వారికి అవ‌గాహ‌న క‌ల్పించి ఉత్సాహప‌రుస్తున్నారు. 
 
కాని, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో వేల సంఖ్య‌లో స్వ‌చ్చందంగా  క‌ష్ట‌ప‌డుతున్న అభిమానుల‌ను ప్రోత్స‌హించే దిశ‌గా ఎలాంటి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్టాల్సిన  విష‌యాన్ని ప‌క్క‌కు పెట్టి కొంత‌మంది  వైసీపీ అభిమానులు వారిలో వారే ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ త‌లా తోక లేకుండా ముందుకు సాగుతున్నారు. 
 
క్షేత్ర స్ధాయిలో టీడీపీకి ఉన్న నాయ‌క‌త్వం గురించి అంద‌రికీ తెలుసు. ప్ర‌భుత్వ వైఫ్య‌లాల‌తో పాటు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను క్షేత్ర స్ధాయిలో తీసుకెళ్లేందుకు సోష‌ల్ మీడియా ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. 
 
అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వ సొమ్మును అనధికారికంగా ఖ‌ర్చుచేసి మ‌రీ ప్ర‌చారార్భాటాలు చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎలాంటి జీతాలు ఆశించ‌కుండా వైసీపీ కోసం ప‌ని చేసే వారు  వేల సంఖ్య‌లో ఉన్నారు...వారంతా సోష‌ల్ మీడియాలో పార్టీకోసం ప‌ని చేస్తూనే ఉన్నారు.
 
ఈ క్ర‌మంలో  జిల్లా స్ధాయిలో..... వీలైతే నియోజ‌క‌వ‌ర్గ స్ధాయిలో మీటింగ్ లు పెట్టి  పార్టీ కోసం సోష‌ల్ మీడియాలో పని చేస్తున్న  వారిని  ప్రోత్స‌హిస్తే, వారు ఉత్సాహంగా ప‌ని చేసే అవ‌కాశం ఉంది. ఈ దిశ‌గా వైసీపీ ఐటీ వింగ్ అడుగులు వేస్తుందా లేదా చూడాలి మ‌రి!!

 

షేర్ :

Comments

1 Comment

  1. Yes this is correct please slowed this problem urgently

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.