వైసీపీ టార్గెట్ 2019 ఎమ్మెల్యేలు 190/175 & ఎంపీలు 35 /25

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 17:17:50

వైసీపీ టార్గెట్ 2019 ఎమ్మెల్యేలు 190/175 & ఎంపీలు 35 /25

సిరీస్ 1 
"ఇంకేం ఉంది మనం గెలవబోతున్నాం... గెలవబోతున్నాం... గెలిచేశాం మీరు ఫిక్స్ అయిపోండి సార్, మన రాష్త్ర ముఖ్యమంత్రి కుప్పంలో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నారు. పవన్ ప్రభావం అంతగా ఏమి లేదు మీరేం వర్రీ అవ్వకండి సార్ మేము ఉన్నాం. మిమ్మల్ని గెలిపించడానికి. గల్లా అరుణ, గల్లా జయదేవ్, గంటా మన లోటస్ పాండ్ గేట్ ముందర పడి గాపులు కాస్తున్నారు.
 
ఇక జేసీ అంటారా అదుగో ఆ లోటస్ పాండ్ కి దూరంగా నడుచుకుంటూ వస్తున్నారు.74 సంవత్సరాల పెద్దాయన కదా ఎలక్షన్ టైం కల్లా లోటస్ పాండ్ గేట్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక మన కంచుకోట కడప జిల్లా జమ్మలమడుగు లో Dr సుధీర్ రెడ్డి దూసుకెళ్తున్నారు..ఆది నారాయణ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారు.. కాకపోతే మీరు ఎమ్మెల్యేగా సీటు ఫిక్స్ చేయలేదనే లోలోపల మధన పడిపోతున్నారు. మీరు సుధీర్ రెడ్డిని 2019 జమ్మలమడుగు అభ్యర్థిగా అనౌన్స్ చేసేయండి సార్ అయన గెలుపుకి నాది హామీ, మీరేం వర్రీ అవకండి సార్... మేము ఉన్నాం కదా మిమ్మల్ని గెలిపించుకోవడానికి.  
 
ఈ మాటలు మేము అంటున్నది కాదు జగన్ కి చాలా సన్నిహితులుగా ఉంటూ వస్తున్న మాజీ సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రస్తుత రాజకీయ కార్యదర్శి అయన మరెవరో కాదు సజ్జల రామకృష్ణా రెడ్డి మరియు జగన్ వ్యక్తిగత సహాయకుడు అతనే KNR. గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణని ఎలా అయితే చేజార్చుకున్నారో ఇవాళ గల్లా అరుణ మరియు గల్లా జయదేవ్ ని కూడా అలాగే చేజార్చుకున్నారు. అసలు లోపం ఎక్కడ ఉంది..? సరిదిద్దుకోవాల్సింది ఎవరు..? ప్రజలలో ఎంతో బలం ఉన్న వైసీపీ అధినాయకుడిని తప్పు దోవ పట్టిస్తున్న సన్నిహిత రాజకీయ నాయకుల గురించి రాయడానికి ఉద్దేశించబడినదే ఈ కథనం ముఖ్య ఉద్దేశం. 
 
పవన్ కి నేను టచ్ లో ఉన్న సార్ మీరేం వర్రీ అవకండి సార్...
 
జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత సినిమా ఓపెనింగ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అరవింద సమేత మూవీ ఓపెనింగ్ మరుసటి రోజు సాక్షి పత్రికలో పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా కేవలం జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కలిసి దిగిన ఫోటో మాత్రమే సాక్షి ప్రచురించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాల బాధపడ్డారని సమాచారం.సినిమాని కూడా రాజకీయం చేయడమేంటి, నా ఫోటో లేకుండా ప్రచురించడం ఏంటి అని కాస్తంత అసహనానికి గురి అయ్యారట.తన మిత్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి,  పవన్ కళ్యాణ్ అప్పాయింట్మెంట్  తీసుకుని కలిశారని సమాచారం.. పవన్ ని కలిసిన సజ్జల రామకృష్ణ రెడ్డి.. నేను సాక్షి మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం... మళ్ళి ఇలా జరగకుండా చూసుకుంటాం అని చెప్పి వెనిదిరిగి వచ్చారని సమాచారం... 
 
ఇక్కడ పవన్ కి, సజ్జల రామకృష్ణ రెడ్డికి ఎటువంటి రాజకీయ మాటలు జరగలేదని, కేవలం సినిమా గురించే మాట్లాడుకున్నారని సమాచారం. కానీ జగన్ కి చేరిన మాట ఏంటో తెలుసా..? సార్ నేను పవన్ కళ్యాణ్ కి టచ్ లో ఉన్నాను...  మీరేం వర్రీ అవకండి సార్ అని చెప్పారట...తను నమ్మిన తన రాజకీయ కార్యదర్శి చెప్పిన మాటలు విన్న జగన్, తన రాజకీయ కార్యదర్శి పవన్ వ్యవహారం చూసి చక్కబెడతాడులే అనుకుంటున్నారని సమాచారం. కానీ ఇక్కడ ఆ రాజకీయ కార్యదర్శి చూడటానికి  కానీ చక్కబెట్టడానికి ఏ ఈ వ్యవహారం లేదు. కానీ జగన్ కి మాత్రం 175 ఎమ్మెల్యే స్థానాలకు 190 మనవే మరియు 25 ఎంపీ స్థానాలకు 35 మనవే అంటూ జగన్ ని మునగ చెట్టు ఎక్కిస్తున్నారు.
 
గల్లా అరుణ కుమారి మరియు గల్లా జయదేవ్ ని డీల్ చేసి చేజార్చుకున్న నేత ఎవరు..? వారి స్వలాభం ఏంటి ? జగన్ నమ్మిన ఆ నమ్మిన బంటు జగన్ ని ఎలా మోసం చేశారు అన్నది మన వైసీపీ టార్గెట్ 2019 ఎమ్మెల్యేలు 190/175 & ఎంపీలు 35 /25  సిరీస్ 2 లో తెలుసుకుందాం.

షేర్ :

Comments

1 Comment

  1. నమ్ముకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ నమ్మకానికి నమ్మకం à°

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.