జ‌గ‌న్ మ‌రో పోరాటం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 16:14:57

జ‌గ‌న్ మ‌రో పోరాటం

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌పున త‌న స్పీడు పెంచిన‌ట్టు తెలుస్తోంది.. ఇప్ప‌టికే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఏపీ భవ‌న్ లో నిరాహార‌దీక్ష చేసి ప్ర‌త్యేక హూదా పై క‌మిట్ మెంట్ ను తెలియ‌చేశారు పార్టీ త‌ర‌పున‌. ఇక రాష్ట్ర‌ప‌తిని క‌లిసి కేంద్రం ఎటువంటి మోసం చేసిందో అనేది తెలియ‌చేశారు ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో.
 
ఇక వైసీపీ అధినేత ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో ఎటువంటి హూదా పోరు తీసుకుంటుందా అని టీడీపీ ఆలోచిస్తోంది. ఇటు తెలుగుదేశం కూడా దీక్షల‌ తో  ముందుకు వెళ్లాలి అని భావిస్తోంది. అయితే జ‌గ‌న్ మాత్రం ఎమ్మెల్యేలు అంద‌రితో ఓ దీక్షా స్ద‌లిలో రెండు రోజులు దీక్ష చేస్తారు అని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి అది అమ‌రావ‌తి వేదిక‌గా జ‌రుగుతుంది అని నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.
 
ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రుగుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ కూడా ఈ దీక్ష కు వ‌స్తారు అని అంటున్నారు. అయితే జ‌గ‌న్ పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు చేస్తున్న తెలుగుదేశం.తాజాగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన త‌ర్వాత ప్ర‌త్యేక హూదా పై కొత్త ఎత్తులు వేస్తోంది ధ‌ర్మ పోరాట దీక్ష‌2 కు రెడీ అవుతోంది.
 
అయితే జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చెయ్యాలి అంటే ముందు జ‌గ‌న్ త‌ర‌పున పార్టీ  ఎంపీలు రాజీనామాలు చేశారు.మ‌రి ఇక్క‌డ చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించ‌లేదు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు లేదా తెలుగుదేశం నాయ‌కులు ఎటువంటి కామెంట్లు చేసే సాహ‌సం చేయ‌డం లేదు.  నిజంగా ప్ర‌జలు కూడా నిల‌దీస్తున్నారు. ఇక గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌రిగే స‌మ‌యంలో ఈ స‌భ జ‌రుగుతుంది అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. జ‌గ‌న్ త‌న దూకుడు పెంచారు అనేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.