వైయ‌స్సార్ విగ్ర‌హానికి ఘోర అవ‌మానం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 10:37:07

వైయ‌స్సార్ విగ్ర‌హానికి ఘోర అవ‌మానం

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. వైయస్సార్ ముఖ్యమంత్రి ఉన్నపుడు కుల,మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా ప్రజలందరీకి ఉపయేగపడే పథకాలను పేద ప్రజలకు అందించారు. అలాంటి నేతను భావితరాలు కూడా గుర్తించుకునేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల విగ్రహాలను ఆవిష్కరించారు. అయితే తాజాగా గుంటూరు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వైయస్సార్ విగ్రహాన్ని దహనం చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రారంభోత్సవం జరగకుండానే దుండగులు ఇలా కాల్చేడం గమనార్హం. విషయం తెలుసుకున్న గురజాల నియోజకవర్గం ఇన్ చార్జ్ కాసు మహేష్ రెడ్డి అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. కావాలనే కొందరు ఇలాంటి దుస్సాహసానికి ఒడిగుడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కాసు డిమాండ్ చేశారు. ఏకంగా పోలీసులు డాగ్ స్కాడ్స్ ను రంగంలోకి దించారు. నిందితులను గుర్తించి, కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్ధానిక సీఐ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.