పెట్టింది వైయ‌స్సార్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 18:47:01

పెట్టింది వైయ‌స్సార్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిన్న క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ స‌మావేశంలో మీడియా ప్ర‌తినిధి కేవ‌లం టీడీపీ నాయ‌కులు శంకుస్థాప‌నలు మాత్ర‌మే చేసుకుంటూ వెళ్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయ‌ని ప్ర‌శ్నించ‌గా. ఇందుకు చంద్ర‌బాబు బ‌దులిస్తూ, ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీ గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు ఏం పీకారు అని ఏక వ‌చ‌నంలో దూషించిన సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే.
 
ఇక తాజాగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుప‌తి ఎంపీ  పి. వరప్రసాద రావు స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, చంద్ర‌బాబు నాయుడు మ‌హానేత, మాజీ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ని ఉద్దేశించి మాట్లాడారా! లేక వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారా! అనేది స్ప‌ష్ట‌త లేద‌ని ఆయ‌న అన్నారు. అయితే చంద్ర‌బాబు వినియోగించిన పీకుడు అనే పదాన్ని పాజిటివ్ గా తీసుకుంటే, పీకేవాళ్లు ఎవ‌రో, పెట్టేవాళ్లు ఎవరో ఇట్టే తేల్చవచ్చు అని వ‌ర‌ప్ర‌సాదరావు స్ప‌ష్టం చేశారు.
 
ఎన్నిక‌ల్లో త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచినా కూడా ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌క‌టించిన‌ హామీల‌ను అమ‌లు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీలు దేవుడెరుగు కానీ వైయ‌స్సార్ అమ‌లు చేసిన హామీల‌ను పీకిపారేశార‌ని (తొలంగించారు) వ‌ర‌ప్ర‌సాదరావు ఆరోపించారు. అయితే చంద్ర‌బాబు పీకే రాజకీయం చేస్తే, వైఎస్సార్‌ పెట్టే రాజకీయం చేశార‌ని ఆయ‌న స్పష్టం చేశారు.
 
పీకింది చంద్ర‌బాబే.
 
చంద్ర‌బాబు అధికారంలో సుమారు ప‌ది ల‌క్ష‌ల పెన్షన్లను పీకేశారు.
 
చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక‌ 60కిపైగా ప్రభుత్వ సంస్థలను పీకేశారు.
 
రైతుల‌కు రుణ‌మాఫీ చేయ‌కుండా మోసం చేశారు
 
అలాగే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని మోసం చేశారు.
 
వైయ‌స్సార్ హ‌యాంలో గొప్పగా అమలైన ఉచిత విద్యుత్‌ పథకాన్ని పీకేశారు.
 
జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గపు కమిటీలను వేసి జనాన్ని పీక్కుతింటున్నారు.
 
వైయ‌స్సార్ పెట్టింది.
 
మహానేత వైయ‌స్సార్ అధికారంలో వ‌చ్చాకా 108 అంబులెన్స్ స‌ర్వీస్  పెట్టారు.
 
డ్వాక్రా మ‌హిళ‌ల‌కు, రైతుల‌కు పూర్తి స్థాయిలో రుణ‌మాఫీ అలాగే వ‌డ్డీలేని రుణాలు  అందించారు.
గ్రామీణ ప్ర‌జ‌ల‌కోసం 104 స‌ర్వీస్ ను పెట్టారు.
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేద పిల్లల చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పెట్టారు.
 
ఇప్ప‌డు చెప్పండి పీకింది ఎవ‌రు - పెట్టింది ఎవ‌రు అని వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.