ప్ర‌జల‌మ‌నిషి పార్టీకి 8 ఏళ్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-12 03:07:12

ప్ర‌జల‌మ‌నిషి పార్టీకి 8 ఏళ్లు

ఎన్ని ఎదురుదెబ్బ‌లు త‌గిలినా ఎదురొడ్డి నిల‌బ‌డే వాడు నిజ‌మైన మ‌నిషి అంటారు... ఇక రాజ‌కీయాల్లో కూడా రాటుతేలిన నాయ‌కులు వేళ్ల‌ల్లో లెక్క‌పెట్ట‌వ‌చ్చు అలాంటి వారిలో  దివంగ‌త మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఒక‌రు.
ఎన్ని ఆటుపాట్లు ఎదురైనా, ప్ర‌జ‌ల వెంటే ఉంటూ ప్ర‌జా మ‌నిషిగా రాజ‌న్న స్పూర్తితో రాజ‌కీయ కుటిల రాజ‌కీయాల‌కు ఎదురొడ్డిన నాయ‌కుడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి..... రాజ‌కీయ శ‌క్తుల‌ను ఎదుర్కొంటూ, నితీవంత‌మైన పాల‌న అందించ‌డ‌మే థ్యేయంగా ముందుకు వెళుతున్నారు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్.
 
ప్రజా సంక్షేమమే ఊపిరిగా అవిశ్రాంత పోరాటాలు కొనసాగిస్తూ, అప్రతిహతంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సప్త వర్షాలు పూర్తి చేసుకుంది..  నేటితో ఎనిమిదో ఏడాదిలోకి అడుగుపెట్టింది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ . ఎన్నో ఒడిదుడుకులు చూశారు 2010 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ వైయ‌స్ జ‌గ‌న్..  ఏపీ రాజ‌కీయాల్లో ఓ విప్ల‌వం తీసుకువ‌చ్చారు అని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు.
 
తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు ఒక చారిత్రక అవసరంగా 2010 మార్చి 12న ఆవిర్భవించింది  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ స్ధాపించిన అన‌తి కాలంలోనే వైసీపీ ఎంతో బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రించింది.....మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత సంక్షోభాలు రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న తరుణంలో పుట్టిన పార్టీని ఆదిలోనే తుంచాలి అని ఆలోచించారు కొంద‌రు స్వార్ధ‌పూరిత రాజ‌కీయ నాయ‌కులు. కాని వారు చేసిన కుట్ర‌లు ఏవీ ఫ‌లించ‌లేదు అనే చెప్పాలి. పార్టీని స్థాపించేటప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ ఒక్కరే తోడుగా నిలిచారు. పార్టీలో ఇద్ద‌రితో మొదలై నేడు కోట్లాది మంది అభిమానం సంపాదించుకుంది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ.
 
2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో 17 ఎమ్మెల్యే సెగ్మెంట్లు, 2 ఎంపీ స్థానాలను గెల్చుకుంది.  అలాగే పార్టీ ఆరంభంలోనే జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,672 ఓట్లు గెలుచుకున్నారు , పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తల్లి విజయమ్మ 81,373 ఓట్ల భారీ ఆధిక్యంతో ఎన్నికై యావత్‌ దేశంలోనే మరపురాని ఒక చరిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. 
 
ఇక త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో 15 ఎమ్మెల్యే స్ధానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి..అలాగే  నెల్లూరులో ఎంపీ స్ధానాన్ని కూడా త‌న ఖాతాలో వేసుకుంది వైసీపీ .. ఇక జ‌గ‌న్ ని అక్ర‌మంగా జైలులో పెట్టి ఎన్నిక‌లకు కేవ‌లం ఆరు నెల‌లు ముందు మాత్ర‌మే  బ‌య‌ట‌కు వ‌ద‌లిలారు.. అయినా  2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం -బీజేపీ -జ‌న‌సేన కూట‌మిల‌ను ఎదురించి స్వ‌ల్ప‌తేడాతో   అధికార పీఠానికి దూరం అయింది వైయ‌స్సార్ పార్టీ ., 67 సీట్లతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది గ‌త ఎన్నిక‌ల్లో. 
 
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పై దుష్ట‌ప‌న్నాగాలు ప‌న్నారు... ఏపీలో ప్ర‌తిప‌క్షం ఉండ‌కూదు అనే తలంపుతో జ‌గ‌న్ పై అనేక  రాజ‌కీయ పాచిక‌లు పారించారు.. ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల‌ను   ప్ర‌లోభాల‌కు దారితీసేలా చేసింది అధికార పార్టీ....వైసీపీ  నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను, ముగ్గురు ఎంపీల‌ను పార్టీ మారేలా చేశారు.. వారిలో నలుగురికి మంత్రి ప‌ద‌వులు రాష్ట్రంలో కేటాయించారు.. దీనిపై జ‌గ‌న్ అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు. వారు రాజీనామా చేయాల‌ని రాజ్యంగాన్ని అప‌హాస్యం చేశారు అని నిల‌దీస్తూనే ఉన్నారు.
 
ఈ ప్ర‌లోభాల‌పై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. ప్లీన‌రీ వేదిక‌గా రాష్ట్ర ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు, సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత జ‌గ‌న్ . ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం తొలి నుంచీ పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్ .. రైతు దీక్ష‌, యువభేరి, ఏపీకి  ప్ర‌త్యేక హూదా  కోసం హస్తిన పోరాటం. గుంటూరులో ప్ర‌త్యేక హూదా కోసం నిరాహార దీక్ష వైసీపీకి చ‌రిత్ర‌లో మ‌రువ‌లేని ఘ‌ట్టాలు..
 
మ‌రో సంవ‌త్స‌రంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీ నాయ‌క‌లను  సిద్దం చేస్తూ పార్టీని ముందుకు న‌డిపిస్తూ మొక్కవోని ధైర్యంతో జగన్ ముందుకు వెళుతున్నారు.. ఇది ఎనిమిదేళ్ల మ‌హా ప్ర‌స్ధాన ప్ర‌యాణం.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.