య‌న‌మ‌ల‌కు లైన్ క్లియ‌ర్ వైసీపీ యాక్ష‌న ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-02 01:55:29

య‌న‌మ‌ల‌కు లైన్ క్లియ‌ర్ వైసీపీ యాక్ష‌న ప్లాన్

తూర్పుగోదావ‌రి జిల్లాలో య‌న‌మ‌ల రేంజ్ వేరు.. య‌న‌మల రామ‌కృష్ణుడు మంత్రిగా తెలుగుదేశంలో త‌న‌కంటూ ఓ స్టేచ‌ర్ ను ఏర్ప‌ర‌చుకున్నారు... తాజాగా ఆయ‌న ఏపీ ఆర్ధిక  మంత్రిగా త‌న పందాలో కొన‌సాగుతున్నారు, సోద‌రుడు సెగ్మెంట్ రాజ‌కీయాలు చూస్తుంటారు, ఇక తాము ఉండ‌గా వైసీపీ ఎదుగుద‌ల ఇక్క‌డ ఉండ‌దు అనుకుంటే గ‌త ఎన్నికల్లో సెగ్మెంట్ లో ఓట‌మి రుచి చూశారు.. అయితే అనూహ్యంగా తెలుగుదేశం అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌రించింది.
 
ఇక ఇటీవ‌ల మైదుకూరు నుంచి ఆయ‌న బంధువుకు మైదుకూరు టీడీపీ నాయ‌కుడు పుట్టాసుధాక‌ర్ యాద‌వ్ కు  తిరుప‌తి దేవ‌స్ధానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి వ‌స్తుంది అని అంద‌రూ ఊహించారు... అదే పుట్టా పై   ఎన్ని విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై వ‌చ్చినా ఆ లెక్క‌లు ప‌క్క‌న పెట్టి ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చేలా ప‌ట్టుబట్టారు య‌న‌మ‌ల.. చివ‌ర‌కు య‌న‌మ‌ల మాట నెగ్గింది... పుట్టాసుధాక‌ర్ యాద‌వ్ కు తితిదే చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌నుంది. మ‌రో రెండు రోజుల్లో ఉత్త‌ర్వులు రానున్నాయి.. అయితే  ఆయ‌న స్వామి సేవ‌కు వెళ్లినా, ఆ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే మైదుకూరు సీటు ఇవ్వాలి అని కోరుతున్నార‌ట, ఆ విష‌యంలో ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌డం లేదు అని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు.
 
ఇక మాజీ మంత్రి డీఎల్ కూడా ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ని ఆలోచిస్తున్నారు... ఇటు పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా కాంగ్రెస్ లో ఉండేవారు, కాని ఇప్ప‌డు ప‌రిస్ధితి దీనికి భిన్నంగా మారిపోయింది... ఆయ‌న పొలిటిక‌ల్ గా సైలెంట్ గా ఉన్నారు.. దీంతో ఆయ‌న‌కు  తెలుగుదేశంలో - వైసీపీలో ఎంట్రీ ఇవ్వ‌డానికి ఎటువంటి స్కోప్ లేకుండా పోయింది.. ఓ ప‌క్క వైసీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే వచ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు తెలుగుదేశం  త‌ర‌పున సీటు క‌న్ఫామ్ చేయాలి అని పుట్టా సుధాక‌ర్ కోరుతున్నారు.
 
 అయితే దీనిపై వైసీపీ పొలిటిక‌ల్ గా రెడీ అవుతోంది... డీఎల్ కు పార్టీలో స‌ముచిత స్ధానం ఎమ్మెల్సీ ప‌ద‌వి అనే వార్త‌లు క‌డ‌ప‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి... ముందు య‌న‌మ‌ల కోరిక ప్ర‌కారం తితిదే ప‌ద‌వి పుట్టాకు ఇచ్చి , వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు పై క్లారిటీ త‌ర్వాత ఇస్తాను అంటున్నార‌ట బాబు.....మ‌రి వైసీపీ యాక్ష‌న్ ప్లాన్ తో డీఎల్ ఈ నెల‌లో ఏదో ఓ డెసిష‌న్ తీసుకుంటార‌ని మైదుకూరులో చ‌ర్చ జరుగుతోంది.... ఇటు య‌న‌మ‌ల కూడా రాజ్య‌స‌భ‌కు వెళ్లే యోచ‌న‌లో ఉన్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళితే  రాష్ట్ర రాజ‌కీయాల్లో లోకేశ్ క‌లుగ‌చేసుకోనివ్వ‌రు అని తెలుగుదేశం సీనియ‌ర్లు కూడా చ‌ర్చించుకుంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.