వైసీపీ గెలుపు గుర్రాలు వీరే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:15:58

వైసీపీ గెలుపు గుర్రాలు వీరే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఇంచు మించు ఇంకా ఏడాది కాల వ్య‌వ‌ధి ఉంది. అయితే అప్పుడే నియోజ‌కవ‌ర్గాల వారీగా త‌మ ఆదిప‌త్యాన్ని తెలుసుకునేందుకు ఇటు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అటు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు సెగ్మెంట్ ల వారీగా తిష్ట‌వేసుకుని కూర్చున్నారు. ఇక ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు అసెంబ్లీ సీట్ల కోసం కొట్టు మిట్టాడుతున్నారు.
 
సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో సారి అధికారాన్ని ద‌క్కించుకోవాల‌నే నేప‌థ్యంలో సైకిల్ యాత్ర, మినీ మ‌హానాడు స‌భ‌ల‌కు పిలుపునిచ్చారు. అయితే పార్టీ అధినేత కోరిక మేర‌కు సెగ్మెంట్ ల వారిగా టీడీపీ నాయ‌కులు త‌మ స‌త్తాను చాటుతున్నారు. అయితే ఇక్క‌డ ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్ర‌తీ నియోజ‌కవ‌ర్గానికి టీడీపీ ఇంచార్జ్ లు ఇద్ద‌రు ఉన్నారు. వీరు తమకంటే త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కేటాయించాలంటూ అధిష్టానాన్ని ఫోర్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సైకిల్ యాత్ర‌పేరు చెప్పి విడివిడిగా యాత్ర‌ను చేప‌డుతున్నారు. దీంతో వ‌ర్గ విభేదాలు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే..
 
ఇక వీరితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా చ‌ర్చించుకుంటూ త‌మ త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌కు సంబంధించి ప్ర‌స్తుతం చ‌ర్చించుకుంటున్నారు. ఇక వారు కూడా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున సీటు వ‌స్తుందో లేదో అన్న డైల‌మాలో పడ్డారు. మ‌రికొంద‌రు అయితే తిరిగి సొంత గూటికి చేరేందు సిద్ద‌మ‌య్యారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వైసీపీలోకి చేర్చుకునేందు వైఎస్ జ‌గ‌న్ సంకోచించ‌కున్నార‌ని తెలుస్తోంది.
 
ఇక‌ వైసీపీ అసెంబ్లీ సీట్ల విష‌యానికి వ‌స్తే టీడీపీ కంటే వైసీపీ ముందంజ‌లో ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆర్థికంగా సామాజికంగా, ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న కొంత‌మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌శాంత్ కీషోర్ టీమ్ రెడి చేసింది. అయితే ఈ లిస్ట్ అధికారికంగా విడుద‌ల చేయ‌లేదు. కానీ తాజా రాజ‌కీయ విశ్లేష‌కుల స‌మాచారం ప్ర‌కారం గన్నవరం నుంచి వైసీపీ త‌ర‌పున యార్లగడ్డ వెంకటరావు పోటీ చేయిస్తార‌ని తెలుస్తోంది. ఇక్క‌డ టీడీపీకి బ‌లం ఎక్క‌వ‌గా వుండ‌డంతో వేంక‌ట‌రావును నిల‌బెడితే ప్ర‌త్య‌ర్థికి గ‌ట్టి పోటీ త‌గులుతుంద‌ని భావించార‌ట‌.
 
అలాగే మచిలీపట్నం నుంచి నాని, నందిగామ నుంచి జగన్మోహన్‌రావును మ‌ళ్లీ వైసీపీ త‌ర‌పున పోటీ చేయించేందుకు జ‌గ‌న్ రెడి అయ్యార‌ని తెలుస్తోంది. దీంతో పాటు పెద‌న సెగ్మెంట్ నుంచి  జోగి రమేష్ ను పోటీ చేయించేందు వైసీపీ అధినేత ఆలోచిస్తున్న‌ట్లు తెల‌స్తోంది. ఇక అవ‌నిగడ్డ నుంచి 2014 పోటీ చేసిన సింహాద్రినిమ‌ళ్లీ తీరిగి పోటీ చేయించ‌నున్నార‌ట‌.
 
ఇక విజ‌య‌వాడ విష‌యానికి వ‌స్తే, తూర్పూ విజ‌య‌వాడ నుంచి ఇటీవ‌లే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న టీడీపీ సీనియ‌ర్ నేత య‌ల‌మంచిలి ర‌వి పార్టీ త‌ర‌పున పోటీ చేయించేందుకు జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. అలాగే నూజివీడు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకాప్రతాప్‌ అప్పారావు పోటీ చేస్తారని తెల‌స్తోంది.ఇక గుడివాడ నుంచి మళ్లీ కొడాలి నాని నే పోటీ చేస్తారని స‌మాచారం. 
 
కైక‌లూరు విష‌యాని వ‌స్తే ఇప్ప‌టికే జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు  దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తారని జగన్‌ తన పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ విష‌యానికి వ‌స్తే అక్క‌డి నుంచి  వంగవీటి రాధాకృష్ణ పోటీ చేస్తారని సమాచారం. అలాగే విజ‌య‌వాడ వెస్ట్ విష‌యాని వ‌స్తే 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఈ సెగ్మంట్ నుంచి టీడీపీ, అలాగే బీజేపీ నాయ‌కులు వైసీపీకి గ‌ట్టి పోటీని ఇచ్చారు. ఇక ప్ర‌త్యర్థులును ఎదుర్కుని వైసీపీ త‌ర‌పున జ‌లీల్ ఖాన్ గెలుపొందారు. 
 
అయితే ఆయ‌న అధికార తెలుగు దేశం పార్టీలోకి ఫిరాయించిన సంగ‌తి తెలిసిందే. జ‌లీల్ ఖాన్ చేతిలో ఓడిపోయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈయ‌న కొద్ది రోజుల క్రితం బీజేపీకీ రాజీనామా చేసి వైసీపీలోకి చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక పెనమలూరు నియోజ‌క వ‌ర్గానికి వ‌స్తే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి దెబ్బ త‌గిలింది 2014లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన‌ అభ్య‌ర్థి కుక్కల విద్యాసాగర్‌ దాదాపు 31,138 ఓట్ల తేడాతో బోడె ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 
 
దీంతో  2019 ఎన్నిక‌ల‌కు బ‌ల‌మైన నాయ‌కుడిని అభ‌క‌య‌ర్థిగా నియంచేందుకు జ‌గ‌న్ ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ తో స‌ర్వే చేయించారు. ఈ స‌ర్వేలో బ‌ల‌మైన అభ్య‌ర్థి లేక‌పోవ‌డంతో తిరిగి మ‌ళ్లీ  కుక్కల విద్యాసాగర్ ను పోటీ చేయించేందుకు జ‌గ‌న్ అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

1 Comment

  1. కుక్కల విద్యాసాగర్ ఎక్కడ ఉన్నాడు పోటీ చేయటానికి.

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.