చంద్ర‌బాబుకు వైసీపీ జ‌వాబు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-27 16:18:01

చంద్ర‌బాబుకు వైసీపీ జ‌వాబు ?

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీకి ప్ర‌త్యేక హూదా అంశాన్ని ముందు నీరుగార్చి ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి తీసుకురావ‌డం ఏమిటి అని మండిప‌డుతున్నారు వైసీపీ నాయ‌కులు... ప్ర‌త్యేక హూదా పేరు ఎత్తితే జైల్లో పెట్టిస్తా అన్న తెలుగుదేశం స‌ర్కారు, ఈ రోజు ఎలా ప్ర‌త్యేక హూదా కోసం పోరాటం చేస్తున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ఇక కొత్త‌గా సీఎం చంద్ర‌బాబు మ‌రో అంకానికి తెర‌లేపారు.ప్రత్యేక హోదాపై పూటకో మాట, రోజుకో వేషం వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు  కుట్రలో తాము భాగస్వాములం కాదల్చుకోలేదని, మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది
 
ఏ నైతికతా లేని ముఖ్యమంత్రిని ఎలా నమ్మాలి..? హోదాపై ఇప్పటికే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాం, ఇక ఇప్పుడు ఎటువంటి కొత్త ప్లాన్ లు వేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు తెలుసు అని వైసీపీ విమర్శ‌లు చేస్తోంది..సోమవారం రాత్రి పార్టీ సీనియర్‌ నేతలతో అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రకటనలో తెలియ‌చేసింది.
 
సెప్టెంబర్‌ 8, 2016లో ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన చేశారు. మళ్లీ మొన్న కేంద్ర క్యాబినెట్‌ నుంచి టీడీపీ మంత్రులు వైదొలగుతున్నప్పుడు మళ్లీ అదే ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు. రెండూ ఒకే రకమైన ప్రకటనలు అయినప్పుడు గతంలోనే ఎందుకు వ్యతిరేకించలేదు? మొదటిసారి జైట్లీ ప్రకటన చేసినప్పుడు చంద్రబాబు చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా ఉందని పొగడలేదా? అసెంబ్లీలో ధన్యావాదాల తీర్మానం పెట్టి కేంద్రంపై ప్రశంసల వర్షం కురిపించలేదా? 
 
గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై ఏ పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని చంద్రబాబు నీరుగార్చలేదా? బంద్‌లు, ధర్నాలు అడ్డుకోలేదా? ఈ ఆందోళనలను దగ్గరుండి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించలేదా? చివరకు విద్యార్థుల్లో చైతన్యం తీసుకు రావడానికి యువభేరీలు నిర్వహిస్తే పిల్లలపై పీడీ యాక్టులు పెడతామని బెదిరించలేదా? నిరాహారదీక్షలు చేస్తే శిబిరాలు ఎత్తివేయలేదా?  ఇలాంటి కుట్ర రాజ‌కీయాలు చేయ‌డానికి తెలుగుదేశం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది అని ఇందులో బ‌లిప‌శువులం మేము కాద‌ల‌చుకోలేదు అని వైసీపీ తెలియ‌చేసింది. మ‌రీ అదీ క‌రెక్టే పూట‌కో మాట గంట‌కో బాట‌లా ఉంది బాబు రాజ‌కీయం అంటున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.