వైసీపీ బంద్ పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 17:59:16

వైసీపీ బంద్ పిలుపు

క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నిర్మించాలంటూ అఖిల‌ప‌క్ష‌ పార్టీ నాయ‌కులు ఈ నెల 29వ తేదిన జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మ‌ద్ద‌తు తెలిపి పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు.ఈ కార్య‌క్ర‌మానికి క‌డ‌ప అర్భ‌న్ ఎమ్మెల్యే అంజ‌ద్ బాషా, మేయర్‌ సురేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ నాయ‌కులు, రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వ నాయ‌కులు క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ ఏర్పాటు చేయ‌కుండా క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలు కేంద్రంతో పొత్తు పెట్టుకుని విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌పై మోడీతో ఒక్కసారి కూడా చర్చించ‌లేద‌ని విమ‌ర్శిచారు. 
 
క‌డ‌ప ఉక్కు కాల‌సిన ముడిసరుకు, విద్యుత్, రవాణా, నీటి సౌకర్యం ఉన్నా కూడా చంద్ర‌బాబు క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌ల‌పై క‌క్షక‌ట్టుకున్నార‌ని ఆయ‌న విమ‌ర్శలు చేశారు. పోయిన ఎన్నిక‌ల్లో టీడీపీకి  ఓట్లు రాలేద‌నే ఉద్దేశ్యంతో క‌డ‌ప‌లో ఎలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు.
 
ఇక ఇప్పుడ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌జాధ‌ర‌ణ పొందేందుకు టీడీపీ నాయ‌కులు దొంగ‌ దీక్ష‌లు చేస్తూ వారి త‌ప్పును కేంద్రం పై నెట్టి వేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే టీడీపీ నాయ‌కులు ఎన్ని దీక్ష‌లు చేసినా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని చంద్ర‌బాబు నాయుడు చేసే మోసాల‌ను ప్ర‌జ‌లు దృష్టిలో ఉంచుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి త‌గిన బుద్ది చెబుతార‌ని అంజ‌ద్ బాషా స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.