బాల‌య్యకు చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-07 16:28:35

బాల‌య్యకు చెక్

తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌రకూ అనంత‌పురం జిల్లా టీడీపీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు ఇంత వ‌ర‌కూ ఈ జిల్లాలో ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్యక్రామాలు చేయ‌లేదు. దీంతో అనంత ప్ర‌జ‌ల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల‌పై అసంతృప్తి బాగా పెరిగిపోతుంది. 
 
అయితే ముఖ్యంగా చెప్పాలంటే నంద‌మూరి తార‌క రామారావు త‌ర్వాత హిందూపురంలో న‌టుడు బాల‌కృష్ణ 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్త‌వంగా చెప్పాలంటే అక్క‌డ లోక‌ల్ ఎమ్మెల్యేల కంటే హిందూపురం ఎమ్మెల్యే బాల‌య్య‌నే ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారితో అత్యంత స‌న్నిహిత సంబంధాలు పెట్టుకోవాలి.ఎందుకంటే నంద‌మూరి ఫ్యామిలీకి అంత్యంత ఇష్ట‌మైన ప్రాంతం కాబ‌ట్టి... కానీ బాల‌కృష్ణ మాత్రం ఇందుకు వ్య‌తిరేకంగా ఉండ‌టంతో ప్ర‌జ‌ల్లో కూడా ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది.
 
హిందుపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంట‌నే బాల‌కృష్ణ త‌న‌కు పిఏగా చంద్ర‌శేఖ‌ర్ ను నియ‌మించుకున్నారు. ఎందుకంటే ఆయ‌న నియోకవ‌ర్గాన్ని ప‌ట్టించుకునే తీరు లేదు కాబ‌ట్టి ఆ బాధ్య‌ల‌ను చంద్ర‌శేఖ‌ర్ కు అప్ప‌గించారు. ఇక అప్ప‌టి నుంచి బాల‌య్య ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆ బాధ్య‌త‌ల‌న్ని చంద్రశేఖ‌ర్ చేప‌డుతున్నారు. త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించార‌నే నేప‌థ్యంలో హిందూపురంలో నేను ఆడిందే ఆటా పాడిందే పాట అన్న‌ట్లు సాగుతోంది. ఏ కార్య‌క్ర‌మం చేసినా నీకెంత నాకెంత అన్న‌ట్లు వ్య‌వ‌హరిస్తున్నారు చంద్ర‌శేఖ‌ర్. ఒక విధంగా చూస్తే పిఏ ఎమ్మెల్యేగా చెలామ‌ణి అయ్యారు.
 
అదే స‌మ‌యంలో పార్టీనేతల‌పై చంద్ర‌శేఖ‌ర్ చిన్న చూపు చూస్తున్నారు. దీంతో పిఏకు పార్టీ నేత‌ల‌కు ఒక్క‌రోజు కూడా ప‌డేది కాదు. ఇక ఇదే విష‌యాన్ని ఎమ్మెల్యే బాల‌య్య‌కు ఫిర్యాదు చేస్తే ఆయ‌న చూసి చూడ‌న‌ట్లు ప్ర‌వ‌ర్తించార‌ట‌. దాంతో నేత‌లంతా రాజీనామాలు చేసి బాల‌కృష్ణ‌పై తిరుగుబాటు చేస్తే అప్పుడు బాల‌య్య త‌ప పిఏను తొల‌గించి కొత్త పిఏ ను నియ‌మించారు. అయినా సేమ్ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త కూడి ప్ర‌జ‌ల్లో విప‌రీతంగా పెరిగిపోయింది. 
 
అంతే కాదు బాల‌య్య ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టి నుంచి కేవ‌లం ఐదు ఆరు సార్లు మాత్ర‌మే హిందూపురంలో ప‌ర్య‌టించారు. పార్టీ నేత‌ల‌తో కూడా పెద్ద‌గా స‌మావేశం కాలేదు. అప్పుడెప్పుడో సుమారు మూడేళ్ల క్రితం పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఇక ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో నియోజ‌క‌వ‌ర్గంలోని చిల‌మ‌త్తూరు, లేపాక్షి మండ‌లాల నేత‌ల‌తో స‌మావేశం కానున్నారట‌. స‌మావేశం అయిన త‌ర్వాత వెంట‌నే తిరిగి హైద‌రాబాద్ కు చేరుకుంటార‌ట‌. 
 
ఇక ఆయన హిందూపురం ప్ర‌యాణంపై పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. బాల‌కృష్ణ గెలిస్తే త‌మ నియోజ‌కవ‌ర్గాన్ని అభివృద్ది చేస్తార‌నే ఉద్దేశ్యంతో ఆయ‌న‌ను గెలిపిస్తే త‌మ‌ను పూర్తిగా మ‌ర్చిపోయార‌ని ప్ర‌జ‌లు మండిప‌డుత‌న్నారు. బాల‌కృష్ణ కేవ‌లం చుట్టం చూపుగా వ‌చ్చి వెళ్తున్నార‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.
 
ఇక మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ఎప్పుడైతే బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌టం మానేశారో అప్ప‌టి నుంచి ప్ర‌జా స‌మస్య‌ల‌పై పోరాడుతూ జనాలను కూడదీసి ఆందోళ‌న‌లు మొద‌లుపెట్టింది. దాంతో స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్ష నేత‌లు జ‌నాల్లో చొచ్చుకుని పోతూ బాల‌య్య‌కు చెక్ పెడుత‌న్నారు. 
 
పోయిన ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ‌పై పోటీ చేసి ఓడిపోయిన న‌వీన్ నిశ్చ‌ల్ జ‌నాల‌కు అందుబాటులోనే ఉంటున్నారు. ఆందోళ‌న‌లు, నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను ముందుండి న‌డిపిస్తున్నారు. దానికితోడు స‌హ‌జంగానే ప్ర‌భుత్వంపై జ‌నాల్లో పెరిగిపోయిన అసంతృప్తి కూడా వైసీపీకి క‌ల‌సి వ‌స్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.