ఫిరాయింపు ఎంపీల‌కు మ‌రో కొత్త ప్రాబ్లం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 02:41:01

ఫిరాయింపు ఎంపీల‌కు మ‌రో కొత్త ప్రాబ్లం ?

వైసీపీ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన  ముగ్గురు ఎంపీల గుండెల‌లో ఇప్ప‌డు రైళ్లు ప‌రిగెడుతున్నాయి...విప్ అందకుండా తప్పించుకోవడం ఎలా..? ఇలాంటి పుస్తకం ఎక్కడైనా ఉంటే చూడండి.. దాని ధర లక్షల్లో ఉన్నా సరే వీరు కోనేందుకు సిద్దంగా ఉన్నారు....ఎందుకంటే వారికి ఇప్పుడు విప్ గండం పోంచి ఉంది.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రేంద్ర ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అవుతున్న త‌రుణంలో  మోడీ కి గండం అవుతుందో లేదోకానీ.. వీరికి మాత్రం ఇది అతి పెద్ద గండంగా మారుతోంది.. ఈ ముగ్గురు ఎంపీలు తాజా నిర్ణ‌యంతో దిగాలు చెందుతున్నారు..
 
అందుకే విప్ అందకుండా తప్పించుకునే వివిధ మార్గాల అన్వేషణలో ఉన్నారు. ఆ ముగ్గురు ఎంపీలు మరెవ్వరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. ఆ తర్వాత స్వార్థ ప్రయోజనాలకోసం.. తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి - కొత్తపల్లి గీత - బుట్టా రేణుక.
 
విషయం ఏంటంటే.. అవిశ్వాస తీర్మానం ఓటింగ్ వరకు వచ్చిందంటే గనుక.. దాదాపుగా అన్ని పార్టీలు తమ తమ సభ్యులకు విప్ జారీ చేస్తాయి. ఆ లెక్కన ఈ ముగ్గురికి కూడా వైసీపీ విప్ ఇస్తుంది. విప్ అందుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఒక చిక్కు.. ఓటు వేయ‌కుంటే మ‌రో చిక్కు....వారిప్పుడు తెలుగుదేవంలో  ఉన్నందున‌.. ఆ పార్టీ అవిశ్వాసానికి మద్దతిస్తుందో లేదో ఇప్పటిదాకా స్ప‌ష్ట‌త‌ లేదు. అలాగని విప్ అందిన తర్వాత ఓటింగ్ కు వెళ్లకపోతే ధిక్కరణ అవుతుంది.. పార్టీ ఫిర్యాదు చేస్తే విప్ ధిక్కరణకు పాల్పడినందుకు వెంటనే పదవి పోయినా ఆశ్చర్యం లేదు. 
 
ప్రస్తుతం ఆ ఎంపీల పరిస్ద‌తి కుడితిలో ప‌డ్డ ఎలుక‌లా త‌యారైంది. అయితే వారు ఇప్పుడు ఏటూ తేల్చుకోలేక సతమతం అవుతున్నట్లు సమాచారం. అయితే వీరు త‌మ‌కు అసలు విప్ అందకుండానే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా.. అనే ఆలోచన కూడా  ఉన్నార‌ట‌.. ఆస్పత్రుల్లో చేరడం విప్ జారీ కావడానికి ముందే విదేశాలకు వెళ్లడం వంటి మార్గాలు చూసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 
 
వారు ముగ్గురూ తెలుగుదేశంలోకి ఫిరాయించిన తర్వాత.. జగన్ ఎన్నిసార్లు స్పీకరుకు ఫిర్యాదుచేసినా.. ఏమీ ఫలితం సాధించలేకపోయారు. అదేసమయంలో.. విప్ అవకాశం వచ్చి.. విప్ ధిక్కరణ పై ఫిర్యాదు చేయగలిగితే.. ఆయన వారికి బుద్ధి చెప్పినట్లుగా అవుతుందని కూడా పలువురు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.