ఆ జిల్లాలో వైసీపీకి 10 సీట్లు గ్యారంటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-05 17:47:50

ఆ జిల్లాలో వైసీపీకి 10 సీట్లు గ్యారంటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార తెలుగుదేశం పార్టీ కంచుకోట అనంత‌పురం జిల్లాలో సైకిల్ కు బీట‌లు వాల‌నున్నాయా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు నాటి నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కు అనంత‌లో టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. గ‌తంలో దివంగ‌నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంత‌టి వారిని ఆశ్య‌ర్యప‌రిచేలా చేసింది ఈ జిల్లా. 
 
ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ 12 అసెంబ్లీ సీట్లను కైవ‌సం చేసుకోగా వైసీపీ కేవ‌లం రెండు సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశంతో వైఎస్ జ‌గ‌న్ స‌రికోత్త స్ట్రాట‌జీ వేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జాసంకల్ప‌యాత్ర‌లో భాగంగా ఈ జిల్లాలో ప‌ర్య‌టించి 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాను ప్ర‌జ‌లకు వివ‌రించి అనంత జిల్లా ప్ర‌జ‌ల‌ను ఆలోచించేలా చేశారు జ‌గ‌న్. 
 
ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండ‌టంతో అనంత‌పురం జిల్లా వైసీపీ నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టీడీపీ కంచుకోట‌ను బ‌ద్దలు కొట్టాల‌ని జ‌గ‌న్ సూచించార‌ట‌. 14 అసెంబ్లీ స్థానాలు 2 పార్ల‌మెంట్ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో నాలుగు సంవ‌త్స‌రాలుగా టీడీపీ నాయ‌కులు ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం కూడా చేయ‌లేదు. అయితే ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని చెప్పారు. 
 
ఇక దీనికి తోడు ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కులు రెండు వర్గాలుగా విడిపోయి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో మా నాయ‌కుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కేటాయించాలని పార్టీ అదిష్టానానికి అధిక సంఖ్య‌లో సిఫార‌స్సులు చేస్తున్నార‌ట‌. ఇక ముఖ్యంగా ఈ జిల్లాలో ప్ర‌ధానమైన‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి ఆయువు ప‌ట్టుగా ఉంది. 
 
ఇక ధ‌ర్మ‌వ‌రం గుంత‌క‌ల్లు లో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు త‌గ్గిపోతుంది. క‌దిరి ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. అభివృద్ది పేరుతో టీడీపీలోకి ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తే గెల‌వ‌డం క‌ష్టంగా మారుతుంద‌ని తెలుస్తోంది. ఇక క‌ళ్యాణ దుర్గంలో మాత్రం టీడీపీకి వైసీపీకి 50-50 ఛాన్సస్ ఉన్నాయ‌ని తెలుస్తోంది. దీంతో పాటు మ‌డ‌క‌శిర పెనుకొండ పుట్ట‌ప‌ర్తిలో టీడీపీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయింది. సో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా వైసీపీ హైప్ అవుతుంద‌నే చెప్పాలి. 
 
ఇప్పుడు రాయ‌దుర్గంలో మాత్రం వైసీపీ నాయ‌కులు క‌ష్ట‌ప‌డాలి. ఎందుకంటే ఇక్క‌డ బీసీకి చెందిన కుల‌స్థులు ఎక్క‌వ‌గా ఉన్నారు. అంతేకాదు రాయ‌దుర్గంలో బీసీకి చెందిన కాల‌వ శ్రీనివాసులు మంత్రిగా ఉండ‌టంతో వైసీపీ నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం గ‌ట్టిగా పోరాటం చేయాలి. ఇక రాప్తాడు గురించి పెద్ద‌గా చెప్పాల్సిన అవ‌సరం లేదు ప్ర‌జా సేవ‌లో వైసీపీ ఇంచార్జ్ తోపుదుర్తి దూసుకుపోతున్నారు. సో ఇక్క‌డ వైసీపీ విజ‌యం త‌ధ్యం. 
 
ఇక సింగ‌న‌మల‌ విష‌యానికి వ‌స్తే  వైసీపీ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క అని అంటున్నారు. అనంత‌పురం అర్భ‌న్ లో కూడా టీడీపీకి బీటలు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. జేసీ కంచుకోట తాడిప‌త్ర‌తిలో కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నెగ్గ‌డం క‌ష్టంగా మారుతోంది. ప్ర‌తీ రోజు జేసీ అనుచ‌రులు ఎవ‌రో ఒక‌రు ఆ ఫ్యామిలీకి దూరం అవుతూనే వ‌స్తున్నారు. సో తాడిప‌త్రిలో జేసీ ఫ్యామిలీ గెలుపు క‌ష్టంగా మారుతోంది. 
 
మ‌రో వైపు తాడిప‌త్రిలో పెద్దారెడ్డి వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల్లో దూసుకుపోతున్నారు. ఇక‌ హిందూపురంలో వైసీపీ పాగావేయ‌డం కాస్త క‌ష్టంగా మారుతోంది . మొత్తం మీద ఈ జిల్లాలో నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా మూడు లేక నాలుగు సీట్లు చంద్ర‌బాబుకు ఇచ్చి మిగిలిన ప‌ది సీట్లు వైసీపీ త‌న్నుకు పోయేందుకు సిద్దమ‌య్యార‌ని తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.