గ‌ల్లా విష‌యంలో వైసీపీ చెక్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 01:00:28

గ‌ల్లా విష‌యంలో వైసీపీ చెక్ ?

అస‌లు తెలుగుదేశం అంటే ఈ ప్ర‌శంస‌లు -స‌న్మానాలు -స‌త్కారాలు వాట్ నాట్ అన్నింటికి ముందు ఉండే పార్టీ అంటారు, నాడు కాంగ్రెస్ నాయ‌కులు నేడు వైయ‌స్సార్ పార్టీ నాయ‌కులు... సాధించేది ఆవ‌గింజంత సాధించాల్సింది మ‌ర్రిమానంత అయితే.. ఆ ఆవ‌గింజంత సాధ‌న‌కే స‌త్కారాలు చేయించుకోవ‌డం, స‌న్మాన కార్య‌క్రమాలు చేయించుకోవ‌డం పై ఇటు రాష్ట్రంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేకత వ‌స్తోంది.
 
పార్ల‌మెంట్లో కేంద్రం మెడ‌లు వంచి, ఏపీకి ఏం సాధించారో తెలియ‌కుండా తెలుగుదేశం నాయ‌కులు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కు స‌న్మానాలు ఎందుకు చేశారో తెలియ‌డం లేద‌ని, వైసీపీ నాయ‌కులు స‌టైర్లు వేశారు... పార్లమెంట్లో మోదీ భ‌య‌ప‌డ్డార‌ని, ఏపీకి ప్ర‌త్యేక హూదా రైల్వే జోన్ క‌డ‌ప ఉక్కు, అన్ని  ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు అని, ఆస్ధాన మీడియా అనేక వార్త‌ల‌ను వండివార్చింది.
 
అయితే ఇటువంటి వార్త‌లు రెండు రోజులు జ‌నాలు చూసేస‌రికి వారికి బోర్ కోట్టి, ఎంట‌ర్ టైన్మెంట్ స్ట్రీమ్ కు మారారు.. ఇక జ‌గ‌న్ రాజీనామా అస్త్రాన్ని ప్ర‌యోగిస్తే, ఆ వార్త‌ల‌కు స్పేస్ లేకుండా చేస్తోంది ప‌చ్చ మీడియా అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
ఇక వైసీపీ నాయ‌కులు  ప్ర‌తిప‌క్షం త‌ర‌పున గ‌ల్లా జ‌య‌దేవ్ ని విమ‌ర్శిస్తున్నారు అని భావించినా, ఇక్క‌డ తెలుగుదేశంలో కూడా, కొంద‌రు నాయ‌కులు గ‌ల్లా తీరుపై కాస్త గుర్రుగా ఉన్నార‌ట‌....గ‌ల్లాకు బాబు ప్రశంస‌లు ద‌క్కాయి అని... తాము క‌ష్ట‌ప‌డ‌లేదా అనే బాధ‌లో ఉన్నార‌ట తెలుగుదేశం నాయ‌కులు... ఇక కొర‌డాతో కొట్టుకున్నా మాకు ద‌క్కింది ఏమీ లేద‌ని స‌ద‌రు ఎంపీ బాధ‌ప‌డ్డార‌ట‌... అస‌లు కేంద్రం నుంచి ఏమీ సాధించ‌కుండానే ఇలా హడావుడి చేయించుకోవ‌డం పై తెలుగుదేశం నేత‌లు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు... ఇక వైసీపీ కూడా గ‌ల్లాకు రాజ‌కీయంగా చెక్ పెట్టనుంది అని జిల్లా నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.. ఓ ప‌క్క బీజేపీ ఇటీవ‌ల గల్లా విష‌యంలో ఓ లెక్క‌ల చిట్టాను విప్పింది.. దీంతో ఆయ‌న‌కు బాబు ప్ర‌యారీటీ ఇవ్వ‌డం ప‌ట్ల ఏపీ బీజేపీ నాయ‌కులు కూడా మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.