కష్టం జగన్ ది, నిర్లక్ష్యం ఇంచార్జీలది..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-16 14:37:08

కష్టం జగన్ ది, నిర్లక్ష్యం ఇంచార్జీలది..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ నుంచి గల్లీ దాక బలమైన రాజకీయ నాయకులను ఢీకొన్న నేత, ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటి నుండి నిత్యం ప్రజల్లో ఉన్న ఏకైక నాయకుడు. తనను కష్టాలపాలు చేస్తారని తెలిసినా ఢిల్లీని ఆ నాయ‌కుల అహంకారాన్ని ఎదిరించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి...అయన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని నిత్యం కష్టపడుతుంటే, వైసీపీ ఇంచార్జిలు మాత్రం జగన్ కష్టపడుతున్నారు కదా అని నిమ్మకు నీరెత్తిన‌ట్టు చూస్తున్నారు.
 
జగన్ మోహన్ రెడ్డి దేశ చరిత్రలో ఎవరూ  చేయనటువంటి సాహసాన్ని చేస్తున్నారు. సుమారు 3000 కిలోమీటర్ల పాదయాత్రకు స్వీకారం చుట్టి, ఇప్పటికే సుమారు 1800 కిలోమీటర్లు మేర పాద‌యాత్ర పూర్తి చేసారు...ఎండను,  లెక్కచేయకుండా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్రలో ముందుకు వెళ్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు ప్ర‌తిప‌క్ష నేత‌...జగన్ పాదయాత్రలో ఉంటూనే పార్టీ నేతలకు, ఇంచార్జిలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు...అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు,దీక్షలు, రైల్ రోకోలో, రిలే నిరాహారదీక్షలు, బంద్ లకు పిలుపునిచ్చారు.
 
జగన్ టీడీపీ వేస్తున్న వ్యూహాలను తిప్పికొడుతూ, ప్రతివ్యూహాలతో విరుచుకుపడుతూ పార్టీని ముందుకు తీసుకువెళ్తుంటే...జగన్ ఆదేశాలను సీరియస్ గా తీసుకోని కొందరు ఇంచార్జిలు నామమాత్రంగా చేస్తున్నారు. కొందరు అయితే అసలు కనిపించడం లేదు...మనం ఎందుకు కష్టపడాలి జగన్ కష్టపడుతున్నాడు. ఆయనే చూసుకుంటాడులే అన్నటుగా వ్యవహరిస్తున్నారు.
 
2014 ఎన్నికలలో కూడా ఇలా వ్యవహరించడం వల్లే పార్టీ అధికారానికి దూరం అయింది..సుమారు 25 నియోజకవర్గాల్లో కేవలం 5 వేల ఓట్లు లోపు తేడాతో వైసీపీ ఓడిపోయింది...టీడీపీకి - వైసీపీకి ఓట్ల శాతం చూసుకుంటే కేవలం 1.5 మాత్రమే...ఇది కూడా కేవలం ఇంచార్జిల నిర్లక్ష్యం వల్లే జరిగింది అని రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు...ఇంచార్జిలు ఇప్పటికైనా మేల్కొని బూతు లెవల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది...
 
టీడీపీ పైన ఉన్న వ్యతిరేఖతను ప్రజల్లోకి తీసుకువెళ్తే పార్టీ బలం మరింత పెరుగుతుంది.కేవలం జగన్ మోహన్ రెడ్డి కష్టంలో ఇంచార్జిలు ఒక్క శాతం కష్టపడినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం...దానితో పాటు  ఇంచార్జిలు ఎలాంటి బేషజాలు లేకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.