బ్రేకింగ్.. వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త అక్ర‌మ అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-11-05 18:07:42

బ్రేకింగ్.. వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త అక్ర‌మ అరెస్ట్

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల అరాచ‌కాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా క‌ర్నూలు జిల్లా బ‌న‌గానప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘ‌ర్ష‌ణ‌ వాతావ‌ర‌ణం ఇంకా స‌ర్దుబాటు కాలేదు. ఎమ్మెల్యే బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి వ‌ర్గం ర్యాలీకి సిద్ద‌ప‌డ‌టంతో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త కాట‌సాని రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
అధికార పార్టీ నేత‌లు త‌మ‌పై దాడి చేస్తే వారిని అరెస్ట్ చేయాల్సింది పోయి త‌మ‌ను అరెస్ట్ చేయ‌డం ఏంట‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు అరెస్ట్ అయిన కాట‌సాని రామిరెడ్డిని పోలీస్ అధికారులు ఎక్క‌డికి త‌ర‌లించారో తెలుప‌డంలేద‌ని వైసీపీ నాయ‌కులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఫిరాయింపు మంత్రి అఖిల ప్రియ కూడా మీ.. అంతు చూస్తాం లెక్క‌లు చూస్తామంటూ వైసీపీ నాయ‌కులకు వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు