బ్రేకింగ్.. చంద్ర‌బాబు నిర్ణ‌యం వైసీపీ కార్య‌క‌ర్త‌ గుండెపోటుతో మృతి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-07-24 02:19:43

బ్రేకింగ్.. చంద్ర‌బాబు నిర్ణ‌యం వైసీపీ కార్య‌క‌ర్త‌ గుండెపోటుతో మృతి

ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేంద్ర వైఖ‌రిని ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు. ఇక ఆయ‌న కోరిక మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అభిమానులు రోడ్డు ఎక్కి బంద్ ను చేస్తున్నారు. వైసీపీ నాయ‌కులు ఎక్క‌డ బంద్ చేస్తే క్రెడిట్ మొత్తం వారికే పోతుంద‌ని భావించి టీడీపీ స‌ర్కార్ వైసీపీ నాయకుల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేయిస్తోంది. ఈ బంద్ లో పాల్గొన్న మ‌హిళ‌ల‌ను కూడా పోలీస్ అధికారులు పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తిస్తు అరెస్ట్ చేస్తున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కూడా వైసీపీ నాయ‌కులు బంద్ చేప‌డుతుంటే వారిని అక్రమంగా పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు జ‌గ్గారెడ్డి గూడెం పీఎస్ కు త‌ర‌లించే మార్గంలో వైసీపీ కార్య‌క‌ర్త దుర్గారావుకు గుండె పోటు వ‌చ్చింది. ఇక ఆయ‌న‌కు గుండెపోటు రాగానే హుటా హుటిన ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్న మార్గం మ‌ధ్య‌లో ఆయ‌న మృతి చెందారు.
 
దుర్గారావు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బుట్టాయి గూడెం మండ‌లం కృష్టాపురం వాసిగా గుర్తించారు. పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేకున్నా కూడా వైసీపీ నాయ‌కులను అక్ర‌మంగా అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. దుర్గారావు మృతికి టీడీపీ నాయ‌కులే కార‌ణం అని వైసీపీ నాయ‌కులు వాపోతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.