బ్రేకింగ్ వైసీపీ నేత అక్ర‌మ అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-08-31 11:50:01

బ్రేకింగ్ వైసీపీ నేత అక్ర‌మ అరెస్ట్

అనంత‌పురం జిల్లా ఎల్ల‌నూరు మండ‌లం తిమ్మంప‌ల్లిలో ఉద్రిక్త‌త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తిమ్మంప‌ల్లిలో ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దారెడ్డిపై అక్ర‌మ కేసులు బ‌నాయించారు పోలీసులు. ఈ గ్రామంలో వైసీపీ నేత‌పై టీడీపీ నాయ‌కులు దాడిచేశారు. 
 
అయితే దీనిని వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న‌కు దిగిన పెద్దారెడ్డిని జేసీ బ్ర‌ద‌ర్స్ బ‌లంతో పోలీసులు అరెస్ట్ చేయ‌బోయారు. ఇక ఈ అరెస్ట్ ను గ్రామ‌స్తులు అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి 11 గంట‌ల స‌మ‌యంలో పామిడికి త‌ర‌లించారు. టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ రెడ్డి ఒత్తిడితోనే పోలీసులు క‌క్ష‌సాధింపుకు పాల్ప‌డుతున్నార‌ని పెద్దారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments