రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-24 13:31:15

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు అరెస్ట్

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై శుక్ర‌వారం లోక్ స‌భ‌లో చ‌ర్చ జ‌రిగితే ఆ చ‌ర్చ‌లో టీడీపీ ఎంపీలు విఫ‌లం అయినందున వీరికి వ్య‌తిరేకంగా ఈ రోజు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బంద్ కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. పార్టీ అధినేత కోరిక మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా  ప్రశాంతంగా బంద్  చేస్తున్న వైసీపీ నాయ‌కుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అర్థ‌రాత్రి నుంచి వైసీపీ నాయ‌కులు ఎక్క‌డ బంద్ ను నిర్వ‌హిస్తే అక్క‌డికి అధికారులు వెళ్లి బంద్ ను విఫ‌లం చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
 
అయితే ఈ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులను, కార్య‌క‌ర్త‌లను అక్ర‌మంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ బంద్ లో స్వ‌చ్చందంగా పొల్గొన్న మ‌హిళ‌ల‌ను కూడా అత్యంత పాశికంగా ఈడ్చుకెళ్లి  పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా విష‌యంలో మ‌రోసారి వెన్నుపోటు పొడుస్తున్నారు అని మండిప‌డ్డారు. 
 
రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం త‌మ బంద్ కు మ‌ద్ద‌తు తెల‌పాల్సింది పోయి అధికార బ‌లంతో అక్ర‌మంగా త‌మను అరెస్ట్ చేసి ఈ బంద్ ను అణ‌చివేత ధోర‌ణికి పాల్ప‌డుతున్నార‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 
 
దీంతోపాటు ప‌లు చోట్ల పోలీసులు వైసీపీ నాయ‌కుల‌ను గృహ నిర్భందం చేశారు. అయితే ఇప్ప‌టికే పులివెందుల‌లో వైఎస్ వివేక‌, మ‌నోహ‌ర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే తిరుప‌తిలో భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని పోలీసులు అక్ర‌మంగా అరెస్ట్ చేశారు. ఇక విజ‌యవాడ‌లో కూడా య‌ల‌మంచిలి ర‌విని కూడా అరెస్ట్ చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.