చింత‌మ‌నేనికి మ‌రో షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 12:50:09

చింత‌మ‌నేనికి మ‌రో షాక్

సంచ‌ల‌నాల‌కు వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్   దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చౌద‌రి.. ఎప్పుడూ వివాదాల‌తో ఆయ‌న ప‌య‌నిస్తారు అంటారు జిల్లా నాయ‌కులు.. ఇక గ‌తంలో మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ పై దాడి కేసులో ఆయ‌నకు మూడేళ్ల  జైలు శిక్ష ప‌డింది... ఆయ‌న ఆగ‌డాల‌కు ఇక బ్రేక్ ప‌డింది అని రాష్ట్రంలో అంద‌రూ అనుకున్నారు.. అయితే జిల్లా తెలుగుదేశం లో కూడా ఆయ‌న కాస్త దూకుడు స్వ‌భావంతో ఉంటారు.. దీనిపై జిల్లా తెలుగుదేశం నాయ‌కులు కూడా ఎవ‌రు పెద‌వి విప్ప‌లేదు.. ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉన్నా, వారి వైఖ‌రి చెప్ప‌లేదు. చింత‌మ‌నేనిపై ఇటు వైసీపీ మాత్రం బాగానే ఫోక‌స్ చేస్తోంది.
tdp mla chinthamaneni
 
!! కేసు వివ‌రాల్లోకి వెళితే !!
2011 లో మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై, అలాగే ఆయన గన్‌మెన్‌పై దాడి చేశారు చింతమనేని. ఎంపీ కావూరి సాంబశివరావుపై కూడా చేయి చేసుకున్నారు ఆ స‌భ‌లో . దీంతో అప్పట్లో 5 సెక్షన్ల కింద చింతమనేనిపై కేసులు నమోదయ్యాయి. ఏడేళ్లుగా దీన్ని విచారిస్తున్న భీమడోలు మెజిస్ట్రేట్ చింత‌మ‌నేనికి  మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న విప్ ప‌ద‌వికి వెంట‌నే రాజీనామ చేయాల్సిందే, అలాగే ఎమ్మెల్యేగా కూడా ఆయ‌న పై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం ఉంది. దీనిపై చింత‌మ‌నేని హైకోర్టు - సుప్రీం కోర్టుకు వెళ్లే ఆస్కారం ఉంది... అక్క‌డ ఎదురుదెబ్బ త‌గిలితే ఆయ‌న‌కు జైలు శిక్ష త‌ప్ప‌దు. ఇక తాజాగా భీమ‌డోలు కోర్డులో ఆయ‌న‌కు శిక్ష ప‌డ‌గానే కోర్టు తీర్పుతో వెంట‌నే బెయిల్ పిటిషన్ దాఖ‌లు చేసి బెయిల్ తెచ్చుకున్నారు చింత‌మ‌నేని.
ycp mlas
ఇక తర్వాత ప్రొసీడింగ్స్ హైకోర్టుకు వెళ‌తారు అంటున్నారు కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు. ఆయ‌న‌కు అక్క‌డ ఎటువంటి తీర్పులు వ‌స్తాయో వేచి చూడాలి అంటున్నారు. ఇక దెందులూరు వైసీపీ నాయ‌కులు చింత‌మనేనిపై ఫోక‌స్ చేశారు.....దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ని వెంట‌నే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ ఎలక్షన్ కమిషన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వెంకటేశ్వర‌రావుని  కలిసి ఫిర్యాదు చేశారు....దెందులూరు నియోజకవర్గ ఇన్ చార్జి కొఠారు రామచంద్ర రావు, ఆయ‌న‌తో పాటు  ఏలూరు పార్లమెంటు ఇంచార్జి కోటగిరి శ్రీధర్ కూడా ఫిర్యాదు అంద‌చేశారు. అలాగే చింత‌మ‌నేనిని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాలంటూ అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి.
chinthamaneni prabhakar rao 
 
!! గ‌త తీర్పులను  ప‌రిశీలిస్తే!!
ఇండియా కోర్టు చ‌ట్టాలు చెప్పే దాని ప్ర‌కారం.... 2013లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అప్పటి సుప్రీం తీర్పును పరిశీలిస్తే.. ఎమ్మెల్యే చింతమనేనిపై వేటు ఖాయంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే లేదా ఎంపీ ఏదైనా కేసులో రెండేళ్ల  జైలు శిక్షకు గురైతే.. తక్షణమే పదవి కోల్పోతాడు అని తెలుస్తోంది.దీంతో చింత‌మ‌నేనికి మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంద‌ర్బంగా, ఆయ‌న‌పై వేటు అన‌ర్హత ప‌డే అవ‌కాశం ఉంది అంటున్నారు విశ్లేష‌కులు.
ycp tdp

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.