టీడీపీ-బీజేపీకి సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 18:33:08

టీడీపీ-బీజేపీకి సంచ‌ల‌న స‌వాల్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్షను ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ స‌భ‌లో ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, అంబ‌టి రాంబాబు క‌లిసి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేశారు.ఈ సంద‌ర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మీడియా ద్వారా త‌న‌ను ప్ర‌ధాని మోడీ మోసం చేశారంటూ ప్ర‌చారం చేసుకున్నార‌ని అంబ‌టి విమ‌ర్శించారు. 
 
అయితే మోడీ, చంద్ర‌బాబును మోసం చేయ‌లేద‌ని వీరిద్ద‌రూ క‌లిసి ఐదు కోట్ల మంది ఏపీ ప్ర‌జ‌లను నిలువునా మోసం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి మోడీ మోసం చేసినందుకు ఏ1 ముద్దాయిగా ప్ర‌క‌టించాల‌ని, హోదాను కేంద్రానికి అమ్ముకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబ‌బును ఏ2 ముద్దాయిగా రాష్ట్ర ప్ర‌జ‌లు గుర్తించాల‌ని అంబ‌టి పిలుపునిచ్చారు. కొంత‌ కాలంగా టీడీపీ నాయ‌కులు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ, బీజేపీతో క‌లిసి పోటీ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని, అయితే తాము ఎవ‌రితో పొత్తు పెట్ట‌కోమ‌ని ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు.
 
అలాగే ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీకి అమ‌ర సంజీవ‌నీ అయిన ప్ర‌త్యేక హోదా సాధించాలి అంటే అది ఒక్క జ‌గ‌న్ వల్లే సాధ్యం అమ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు నాయుడు  ఏపీకి ముఖ్య‌మంత్రి కావ‌డం మ‌న ఖ‌ర్మ అని మేక‌పాటి ఆరోపించారు. 
 
చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదానే కాదు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని త‌న అదీనంలోకి తెచ్చుకున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు సుమారు 30 సార్లు డీల్లీకి వెళ్లార‌ని, అయితే ఆయ‌న వెళ్లింది ప్ర‌త్యేక హోదా కోసం కాద‌ని త‌న‌కు అడ్డు వ‌స్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎప్పుడు అక్ర‌మాస్తుల కేసుకింద జైల్లో పెడ‌తార‌ని మోదీని అడిగేందుకు వెళ్లార‌ని మేక‌పాటి మండిప‌డ్డారు.
 
ఇక క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్నది వైసీపీనే అని అన్నారు. హోదా సాధ‌న కోసం పార్లమెంట్లో తాము 13సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టామని, కానీ కొందరు కుట్రలు చేసి తీర్మానం చర్చకు రాకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏపీకి ఎందుకూ పనికి రాలేదన్నారు. స్పీక‌ర్ మా రాజీనామాల‌ను ఆమోదించిన త‌ర్వాత‌ ఉప ఎన్నిక‌లు వ‌స్తే టీడీపీ-బీజేపీకి త‌గిన బుద్ది చెబుతామ‌ని వంచ‌న గ‌ర్జ‌న దీక్ష‌లో అవినాష్ రెడ్డి అన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.