బాబు బినామీలకు రూ.240 కోట్ల భూమి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-26 16:43:48

బాబు బినామీలకు రూ.240 కోట్ల భూమి

ఏపీ సీఎం చంద్ర‌బాబు పై అలాగే ఆయ‌న త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ పై అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డంలో బీజేపీ మ‌రింత రాటుతేలుతోంది... తెలుగుదేశం నాయ‌కులు చంద్ర‌బాబు అవినీతికి ఏపీని బ్రాండ్ చేశారు అని, ఇటు వైసీపీ కూడా విమ‌ర్శిస్తోంది.. తెలుగుదేశం స‌ర్కారు  నాయ‌కులు ఈ పాల‌న‌లో ,ల‌క్షా 40 వేల కోట్ల అవినీతి చేశారు అంటూ వైసీపీ నిత్యం విమ‌ర్శిస్తోంది.
 
ఇకశేఖ‌ర్ రెడ్డితో మంత్రి లోకేష్ కు సంబందాలు ఉన్నాయి అంటూ ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా సంచ‌ల‌న కామెంట్ చేశారు... అయితే తెలుగుదేశం నాయ‌క‌లు దీనిపై కౌంట‌ర్లు ఇవ్వడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు... మిన‌హా చేసేది ఏమీ లేకుండా పోయింది... ఇప్పుడు వైసీపీ త‌మ గ‌ళం మ‌రింత పెంచింది... లోకేష్ ప్ర‌తీ ప‌నిలో క‌మీష‌న్లు దండుకుంటున్నార‌ని అలాగే ప్ర‌తీదానికి క‌మీష‌న్లు  అని విమ‌ర్శిస్తున్నారు నాయ‌కులు.
 
240 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని జీఓ నెంబర్‌.523, 547 ద్వారా చంద్రబాబు తన బంధువులకు, బినామీలకు కారుచౌకగా, అప్పనంగా అప్పజెప్పారని ఆరోపించారు కమలాపురం, మైదుకూరు ఎమ్మెల్యేలు రవీంద్రనాధ్ రెడ్డి, రఘురామిరెడ్డి, బాబు ఎటువంటి అవినీతి చేస్తున్నారో ఏపీ అంతా తెలుసు అని విమ‌ర్శ‌లు చేశారు,
 
గ‌త మూడు సంవ‌త్స‌రాలు ఇటు తెలుగుదేశం బీజేపీ క‌లిసి ఉన్నాయి.. ఇప్పుడు ఎన్డీయే నుంచి బ‌య‌టకు వ‌చ్చి నాకు ఎటువంటి సంబంధం లేదు అనడం ఏమిటి  అని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు...  జ‌న‌సేన కూడా అదే గూడులో ఉండేది.... ఆయ‌న‌కు తెలుగుదేశంతో క‌లిసి ఉంటే ఎటువంటి సంకేతాలు వ‌స్తాయో తెలిసి బ‌య‌ట‌కు వ‌చ్చారు అని తెలుగుదేశం నాయ‌కులు గురించి ప్ర‌తీ సెగ్మెంట్లో ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు అని వైసీపీ విమర్శించింది.
 
జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసే హ‌క్కు అంత స్టేట‌స్ మీకు లేద‌ని రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డుపుకునే మీరు ఎటువంటి విమ‌ర్శ‌లు చేస్తున్నారో తెలుసుకోవాలని విమ‌ర్శించారు... ఏనాడు బీజేపీకి స‌పోర్ట్  చేస్తాం అని జ‌గ‌న్ తెలియ‌చేయ‌లేదు ఏపీకి ఎవ‌రు అయితే ప్ర‌త్యేక హూదా ఇస్తారో వారితో క‌లిసి ముందుకు వెళ‌తాం వారికి స‌పోర్ట్ చేస్తాం అని అన్నారు అనే మాట‌ని గుర్తుచేశారు వైసీపీ నాయ‌కులు.
 
క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ వెంటే ఉండి సీటుకోసం వెంప‌ర్లాడి పార్టీ మారి మంత్రి ప‌ద‌వి తీసుకున్న, ఆదినారాయ‌ణ రెడ్డి, జ‌గ‌న్ పై విమర్శ‌లు చేయ‌డం ఏమిటిని ప్ర‌శ్నిస్తున్నారు.. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి  చేసిందీ ఏమీ లేదన్నారు. గండికోట ముంపు బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ప్ర‌జ‌లు 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశానికి త‌గిన బుద్ది  చెబుతారు అని ఫైర్ అయ్యారు వైసీపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.