వైసీపీ నేత‌లు హౌస్ అరెస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-10 13:10:17

వైసీపీ నేత‌లు హౌస్ అరెస్ట్

ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ త‌మ ప్రాణాలను సైతం లెక్క‌చేయ‌కుండా స‌మ‌ర దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే... అయితే వీరు చేస్తున్న‌ పోరాటానికి మ‌ద్ద‌తుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ర‌హదారుల‌పై భైటాయించి కేంద్రంపై నిర‌సన‌లు తెలుపుతూ.. సేవ్ దీ ఏపీ అంటూ నినాదాలు చేస్తున్నారు.
 
అందులో భాగంగానే రాజంపేట పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు ఆకేపాటి అమ‌ర్ నాథ్ రెడ్డి ఏపీకి కేంద్రం ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ డిమాండ్ చేస్తూ కడప-చెన్నై జాతీయ ర‌హ‌దారి పై బైటాయించి వాహ‌నాల రాక‌పోక‌ల‌ను అడ్డుకుంటున్నారు.... ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ల్లే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాకుండా పోయింద‌ని... కేవ‌లం ముఖ్య‌మంత్రి త‌న స్వార్థ‌ రాజ‌కీయాల కోసం కేంద్రానికి ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టుపెట్టార‌ని అమ‌ర్ నాథ్ మండిప‌డ్డారు.
 
అయితే దీంతో పాటు కృష్ణా జిల్లాలో కూడా  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్ ఆద్వ‌ర్యంలో  జాతీయ ర‌హ‌దారిపై దిగ్బంధనానికి సిద్ధమవుతున్న నేప‌థ్యంలో పోలీసులు వారిని అక్ర‌మంగా హౌస్ అరెస్ట్ చేశారు.... తాము కేవ‌లం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం నిర‌స‌లు తెలిపితే ముఖ్య‌మంత్రి కావాల‌నే అరెస్ట్ చేయిస్తున్నారు అంటూ మండిప‌డుతున్నారు... ఇదంతా చంద్ర‌బాబు ఆద్వ‌ర్యంలో జ‌రుగుతుంద‌ని, వారుచేస్తున్న అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, వచ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీడీపీ నాయ‌కులకు త‌గిన గుణ‌పాటం చెపుతారాని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.