పొరాట‌మే మా ఆయుధం...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 11:34:45

పొరాట‌మే మా ఆయుధం...

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా చాలా అవ‌స‌రం... రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్ర‌త్యేక‌హోదాని పోరాటం చేసి సాధించుకోవాలి. అందుకోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా పోరాటం చేస్తూనే ఉంది. హోదా కోసం పోరాటం చేస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ  పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తిచ్చారు. వైసీపీ పోరాటాల‌కు వ‌స్తున్న ప్ర‌జాదర‌ణ‌  చూసి ఓర్వ‌లేక  తేదేపా నాయ‌కులు త‌మ‌పై  విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు అన్నారు.
 
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం త‌మ ప‌దవుల‌ను సైతం త్యాగం చేస్తామ‌ని అన్నారు. ఏప్రిల్‌ ఆరో తేదీన ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌ట‌న రాక‌పోతే ఎంపీ ప‌ద‌వుల‌కు  రాజీనామా చేస్తామ‌ని వెల్ల‌డించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు.
 
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... అవినీతి రాజ‌కీయాలు చేస్తున్న చంద్ర‌బాబుకు బుద్ది చెప్పి....ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం పోరాటం చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అధికారం ఇవ్వ‌డానికి ప్ర‌జ‌లు సిద్దం అయ్యార‌ని అన్నారు. రాష్ట్రానికి  అన్యాయం జ‌రిగితే టీడీపీ పోరాటం చేయ‌కుండా ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేస్తుంద‌ని విమ‌ర్శించారు.
 
ప్ర‌త్యేక హోదా కోసం మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ ఢిల్లీలో ధర్నా చేశారు, గుంటూరులో  మరణ నిరాహార దీక్ష, విశాఖలో భారీ బహిరంగ సభ, యువభేరిలు చేపట్టార‌ని సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ  గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రం పై వైసీపీ తిరుగుబాటు చేస్తూనే రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానిని  మొద‌లుకుని కేంద్ర నాయ‌కులంద‌రినీ ప‌లుమార్లు క‌లిసి హోదా ప్ర‌క‌టించాల‌ని జ‌గ‌న్ కోరిన‌ట్లు తెలిపారు. ప్ర‌త్యేక‌హోదా పై వైసీపీ చేస్తున్న పోరాటానికి టీడీపీ మ‌ద్ద‌తివ్వాల‌ని ఆయ‌న అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.