గ‌ర్జ‌న సాక్షిగా బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-09 13:12:51

గ‌ర్జ‌న సాక్షిగా బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ, రైల్వే జోన్ లు ఏపీకి ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌కుండా మోసం చేసిన కేంద్ర ప్ర‌భుత్వాని వ్య‌తిరేకంగా అలాగే అధికారంలో ఉండి వీట‌న్నింటిపై కేంద్రాన్ని నిల‌దీయ‌కుండా ఉన్న టీడీపీ నాయ‌కులకు వ్య‌తిరేకంగా ఈ రోజు వైసీపీ నాయ‌కులు గుంటూరు జిల్లాలో వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష‌లో వైసీపీ నాయ‌కులు మాట్లాడుతూ, ఐదు కోట్ల మందికి అమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్రం ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌కుండా రాష్ట్రాన్ని వంచించార‌ని విమ‌ర్శ‌లు చేశారు.
 
అయితే ప్ర‌త్యేక హోదా ఇప్ప‌టికీ స‌జీవంగా ఉందంటే అది ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి వ‌ల్లే అని వారు గుర్తు చేశారు. హోదాను ఇవ్వ‌కుండా మోసం చేసిన‌ కేంద్రం ఏ1 ముద్దాయి అయితే  వీటి గురించి  కేంద్రం ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌కుండా గతంలో ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏ2 ముద్దాయ‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.
 
ఇక ఇదే క్ర‌మంలో వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్, మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి త‌మ ప‌ద‌వుల‌ను సైతం లెక్క చెయ్య‌కుండా రాజీనామా చేశార‌ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు యూటర్న్‌ తీసుకుని తాము కూడా ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తున్నామ‌ని చెప్పి రాష్ట్ర‌ వ్యాప్తంగా దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. అయితే వారు చేసే ప్ర‌తీ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చేఎన్నిక‌ల్లో టీడీపీ త‌గిన బుద్ది చెబుతార‌ని వైసీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.