సీఎం ర‌మేష్ దీక్ష వెనుక‌ అస‌లు నిజం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 15:09:25

సీఎం ర‌మేష్ దీక్ష వెనుక‌ అస‌లు నిజం ఇదే

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన కడ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్  క‌డ‌ప జిల్లాలో నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ దీక్ష నేటితో ప‌దవ‌రోజుకు చేరుకుంది. ఇక‌ ఈ దీక్ష‌పై ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. 
 
ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, సీఎం ర‌మేష్ చేసే నిరాహార దీక్ష‌లో చిత్తశుద్ది లేద‌ని వాపోయారు. ఆయ‌న కేవ‌లం ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఓట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు జిల్లాలో డ్రామాలు ఆడుతూ దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు ఫైర్ అయ్యారు. రమేష్ నాయుడు చేస్తున్న దీక్ష ఈ రోజుతో ప‌దిరోజుల‌కు చేరింద‌ని అయితే ఆయ‌న ముఖంలో దీక్ష చేసిన‌ట్లు క‌నిపించ‌డంలేద‌ని, కొత్త పెళ్లికొడుకు అళ్లేం తిన్న‌ట్లు నున్న‌గా నిగ‌నిగ లాడుతున్నార‌ని వారు మండిపడ్డారు. 
 
సాధార‌ణ వ్య‌క్తి కూడా ప‌దిరోజులు దీక్ష చేయ‌లేర‌ని కానీ సీఎం ర‌మేష్ కు బీపీ, షుగ‌ర్ అన్ని ఉన్నా కూడా ప‌దిరోజులు ఎలా దీక్ష చేస్తున్నారో త‌మ‌కు అర్థం కావ‌డంలేద‌ని వాపోయారు. ర‌మేష్ ఎన‌ర్జీ దీక్ష వెనుక ర‌హ‌స్యాలను అలాగే ఆయ‌న హెల్త్ చెక‌ప్ ల‌ను వెంట‌నే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్ష కేవ‌లం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌ను సైగ‌ల‌తోనే చేస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు ఎద్దేవా చేశారు. నిరాహార‌ దీక్ష‌లో ర‌మేష్ తాగే వాట‌ర్ బాటిల్ విలువ సుమారు మూడువేల రూపాయాలని వైసీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.