వైసీపీ నేతలు కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp
Updated:  2018-11-01 11:07:34

వైసీపీ నేతలు కీల‌క నిర్ణ‌యం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితుడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ద‌గ్గ‌ర వెయిట‌ర్ గా ప‌నిచేస్తున్న శ్రీనివాస‌రావు గ‌త బుధ‌వారం విశాఖ ఎయిర్ పోర్టులో హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ హ‌త్య‌య‌త్నంపై వైసీపీ నాయ‌కులు తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ దెబ్బ తినింద‌ని ఈ హ‌త్యాయ‌త్నం పోలీస్-టీడీపీ నేత‌ల‌ క‌నుస‌న్న‌ల్లో జరిగింద‌ని వారు అనుమానిస్తున్నారు. 
 
అందుకే హ‌త్య‌య‌త్నంపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధంలేని స్వ‌చ్చంద సంస్థ‌ల‌చేత‌ విచార‌ణ జ‌రిపిస్తే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఇటీవ‌లే వైసీపీ నేత‌లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర‌ప‌తిని, అలాగే కేంద్ర హోం మంత్రిని క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేసి వ‌చ్చారు. అయితే ఇదే క్ర‌మంలో ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను ఈ రోజు వైసీపీ నాయ‌కులు క‌ల‌వ‌నున్నారు. 
 
త‌మ‌నేత జ‌గ‌న్ పై గ‌త 25వ తేదిన హ‌త్యాయ‌త్నం జ‌రిగిన నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వ అనుమానాస్ప‌ద తీరును ఖండిస్తూ వైసీపీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు వారు ఒక విన‌తిప‌త్రం కూడా అంద జేయ‌నున్నారు. జ‌గ‌న్ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు నిష్ప‌క్షంగా జ‌ర‌గాలంటే థ‌ర్డ్ పార్టీతో విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ ను కోర‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా మ‌రోవైపు శ్రీనివాస‌రావును, అలాగే, అత‌ని స్నేహితుల‌ను, త‌ల్లి దండ్రుల‌ను సిట్ అధికార