మ‌రో కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-17 17:09:51

మ‌రో కీల‌క నిర్ణ‌యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు..హోదా సాధ‌న కోసం నిర‌స‌న‌లు ఉద్య‌మాలు, రిలేదీక్ష‌లు చేస్తున్నారు..ఇక హూదా పోరాట స‌మితి వైసీపీ వామ‌ప‌క్షాలు నిన్న‌ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.. ఇక తాజాగా వైసీపీ ఎంపీలు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
 
వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్ లు క‌లిసి ఈ రోజు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ను క‌ల‌వ‌నున్నారు.. ఇందుకోసం రాష్ట్రప‌తి అపాయింట్  మెంట్ కూడా తీసుకున్నారు వైసీపీ ఎంపీలు...  ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఎంపీలు ఈ రోజు మధ్యాహ్నం కోవింద్ ను కలసి ఓ మెమొరాండం సమర్పించనున్నారు.
 
మెమొరాండం స‌మ‌ర్పించిన త‌ర్వాత 2014 విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప ఉక్కు, విశాఖ రైల్యే జోన్ వంటి  అంశాల గురించి రాష్ట్ర‌ప‌తితో వైసీపీ ఎంపీలు చ‌ర్చించ‌నున్నారు.. హామీలను అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని, వాటిని నెరవేర్చాలని కేంద్రంలోని బీజేపీకి సూచించాలని తాము కోవింద్ ను కోరేందుకు వచ్చామని అన్నారు... అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను రాష్ట్ర‌ప‌తికి వివ‌రిస్తామ‌ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ పార్టీ  మద్దతు పలుకుతుంద‌ని తెలియ‌చేశారు.

షేర్ :

Comments

1 Comment

  1. Ha ha ha

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.