టీడీపీ నాయ‌కుల‌కు రోజా స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-05 17:48:19

టీడీపీ నాయ‌కుల‌కు రోజా స‌వాల్

ఎన్నిక‌లకు కేవ‌లం ప‌ది నెల‌ల స‌మ‌యం ఉంద‌న్న క్ర‌మంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌జా ధ‌ర‌ణ పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష‌ల పేరు చెప్పి దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్‌ బ్రాండ్ రోజా మండిప‌డ్డారు.
 
ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో రోజా మాట్లాడుతూ బీజేపీతో నాలుగు సంవ‌త్స‌రాలు కాపురం చేసి రాష్ట్రానికి విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను ఒక్క‌టి కూడా సాధించ‌లేక పోయిన ఘ‌నత‌ ఒక్క ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు మాత్ర‌మే ద‌క్కుతుంద‌ని రోజా పేర్కొన్నారు.
 
అయితే గ‌తంలో తాము ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్, క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా దీక్ష‌లు చేస్తే త‌మ పార్టీ నాయ‌కులను అక్ర‌మంగా అరెస్ట్ చేయించార‌ని ఆమె గుర్తు చేశారు. ఇక ఇప్పుడు నాలుగు సంవ‌త్స‌రాలు చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు చంద్ర‌బాబు నాయుడు ఎంపీ సీఎం ర‌మేష్ తో దొంగ దీక్ష‌లు చేయించార‌ని రోజా మండిప‌డ్డారు.
 
అయితే ఆయ‌న దీక్ష‌ చేసిన రోజు నాటి నుంచి మెడిక‌ల్ రిపోర్ట్ ను బ‌య‌ట‌పెట్టాల‌ని రోజా డిమాండ్ చేశారు. టీడీపీ నాయ‌కులకు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన‌ అంశాల‌పై కొంచెం కూడా చిత్తశుద్ది లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నా