కేసీఆర్ పై ఉమాస్త్రం సందించిన బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 18:11:15

కేసీఆర్ పై ఉమాస్త్రం సందించిన బాబు

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా మ‌రోసారి పార్టీ కార్యాలయంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఆమె మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై అలాగే ఆయ‌న కుమారుడు మంత్రి నారా లోకేశ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దేశంలో మ‌హిళ‌ల వేధింపుల్లో మ‌న‌ రాష్ట్రం నాలుగ‌వ స్థానంలో ఉంద‌ని రోజా మండిప‌డ్డారు.
 
గతంలో తాను కాల్‌మ‌ని సెక్స్ రాకెట్ పై పోరాడితే టీడీపీ నాయ‌కులు మ‌హిళ‌న‌ని చూడ‌కుండా త‌న‌సై సంవ‌త్స‌రం పాటు అసెంబ్లీ నుంచి తొల‌గించార‌ని ఆమె మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులు చేసే ప్ర‌తీ ప‌నిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు టీడీపీ ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెప్పేందుకు రెడి అయ్యార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.
 
మంత్రి నారాలోకేశ్ ఏపీకి కంపెనీలు తెచ్చామ‌ని మీడియాలో గొప్ప‌లు చెబుతున్నార‌ని రోజా ఫైర్ అయ్యారు. కేంద్ర ప‌రిధిలో వ‌చ్చిన కంపెనీల‌ను కూడా టీడీపీ నాయ‌కులు వారి ఖాతాలో వేసుకుంటున్నార‌ని ఆమె విమ‌ర్శించారు . లోకేష్ ఇలా ప్ర‌చారం చేయ‌డంతో నిజంగా ప‌ప్పు అయ్యార‌ని, అయితే ఆయ‌న‌ను ప‌ప్పు కాకుండా ఇంకేమ‌ని పిల‌వాని రోజా ఆరోపించారు. గతంలో లోకేశ్ ను మిన‌ర్ ప‌ప్పు అనుకున్నామ‌ని, కానీ ఇప్పుడు గ‌న్నేరు ప‌ప్పు అయ్యార‌ని ఈ విష‌యాన్ని త‌న తండ్రి చంద్ర‌బాబు నాయుడు త‌ర్వ‌ర‌లోనే తెలుసుకుంటార‌ని రోజా స్ప‌ష్టం చేశారు.
 
టీడీపీ నాయ‌కులు బీజేపీతో నాలుగేళ్ల‌పాటు పొత్తు పెట్టుకుని విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను ఒక్క‌టి కూడా సాధించ‌లేని ఘ‌న‌ట ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ద‌క్కుతుంద‌ని రోజా విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ వంటి అంశాలు ఇంకా స‌జీవంగా ఉన్నాయంటే అది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ల్లే అని రోజా స్ప‌ష్టం చేశారు. 
 
ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఓట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు టీడీపీ నాయ‌కులు డ్రామాలు ఆడుతూ దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని రోజా ఫైర్ అయ్యారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఏపీకి ర‌ప్పించుకుని ఆయ‌న కాళ్లు ప‌ట్టుకోవ‌డానికి మంత్రి దేవినేని ఉమాను చంద్ర‌బాబు పంపార‌ని రోజా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. లాలూచీ రాజ‌కీయాలు చేయడం టీడీపీ నాయ‌కుల‌కు కొత్తేమి కాద‌ని ఆమె మండిప‌డ్డారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.