కత్తి.... దించేశాడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 17:07:53

కత్తి.... దించేశాడు

కత్తి మహేష్ ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి తన‌దైన‌ శైలిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వ్యక్తి. అయితే పవన్ ఫ్యాన్స్ కి కత్తి మహేష్ కి జరిగిన మతాల యుద్ధంలో మన తెలుగు చానెల్స్ కత్తి మహేష్ ని అమాంతం భుజాన ఎత్తుకుని మరో సెలబ్రిటీ స్టేటస్ తెచ్చి బిగ్ బాస్ లో చోటు తెచ్చి పెట్టాయి. 
 
దళిత వర్గానికి చెందిన కత్తి మహేష్ కి పలు సామాజిక అంశాలమీద తనదైన శైలిలో స్పందిస్తూ ఎట్టకేలకి రాజకీయ అరంగేట్రం మీద స్పందించారు. తన సొంత జిల్లా అయినా చిత్తూరు లోని ఎస్సీరిజ‌ర్వ్డ్‌ పార్లమెంట్ అయినా చిత్తూరు నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఇదే విషయమై ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైస్ జగన్ ని కలిసి చర్చించేందుకు త్వరలో తాను ప్రజా సంకల్పయాత్ర వద్దకి వెళ్తానని ప్రకటించారు.
 
నిత్యం ఏదో ఒక అంశం మీద విమర్శలు చేసే ధోరణి ఉన్న కత్తి మహేష్ వైసీపీ ఎంట్రీ మీద కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ కత్తి మహేష్ కి తమ పార్టీ లో సభ్యత్వం లేదని వెంకటేశ్వర స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ కి తమ పార్టీ సభ్యత్వం ఇవ్వదని తేల్చి చెప్పారు. వైస్ జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలిగే శ్రీకాంత్ రెడ్డి ఇలా స్పందించారు అంటే ఇక కత్తి మహేష్ రాకకి వైసీపీ తలుపులు మూసేసింది అనే చెప్పాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.