బాబు పై వైసీపీ ఎమ్మెల్యేలు ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 16:17:16

బాబు పై వైసీపీ ఎమ్మెల్యేలు ఫైర్

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కై కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా ఈ రోజు నెల్లూరులోని వీఆర్‌ కళాశాల మైదానంలో వంచనపై గర్జన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్ష‌కు రాజీనామ చేసిన ఐదు మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభిమానులు, కార్య‌క‌ర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగు సంవ‌త్స‌రాలు కాపురం చేసి రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌నీ అయిన ప్ర‌త్యేక హోదాను అమ్ముడు పోయార‌ని ఆయ‌న ఆరోపించారు. 
 
అలాగే గ‌డిచిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సుమారు ఆరువంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని, ఆయ‌న అధికారంలోకి వచ్చాక ఒక్క‌హామీని కూడా అమ‌లు చేయ‌లేద‌ని రామచంద్రారెడ్డి ఆరోపించారు. అయితే చివ‌రికి చంద్ర‌బాబు నాయుడు గ్రామం అయిన నారావారి ప‌ల్లెలో కూడా ఒక్క హామీకి కూడా నెర‌వేర్చ‌లేద‌ని వంచనపై గర్జన దీక్షలో రామచంద్రారెడ్డి గుర్తుచేశారు.
 
ఇక‌ కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ, విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాకు ఇంకా ప్రాణం ఉందంటే అది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కార‌ణ‌మ‌ని అన్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని భావించి అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేయ‌లేని ఉద్య‌మాల‌ను జ‌గ‌న్ చేస్తున్నార‌ని అన్నారు.
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నీతి నియ‌మాలు లేవ‌ని, ఆయ‌న ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో కేవ‌లం కుట్ర రాజ‌కీయాలు మాత్ర‌మే చేశార‌ని అభివృద్ది ఎక్క‌డా చేయ‌లేద‌ని శ్రీధ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఇక‌ ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ప‌డుతున్న త‌రుణంలో పది ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు నిరుద్యోగ‌ భృతి క‌ల్పిస్తున్నార‌ని, అయితే ఈ ప‌దిల‌క్ష‌ల‌మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లే అయి ఉంటార‌ని ఆయ‌న ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.