జ‌గ‌న్ పై జ‌రిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నేత‌లు కీలక నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-27 01:00:28

జ‌గ‌న్ పై జ‌రిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నేత‌లు కీలక నిర్ణ‌యం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి విశాఖ ఎయిర్ పోర్టులో కోడిపందాల‌కు వాడే క‌త్తితో హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ హ‌త్యాయ‌త్నాన్ని తీవ్రంగా ఖండించిన‌ వైసీపీ నాయ‌కులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.
 
జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు స‌హించ‌లేక త‌మ నేత‌పై దాడి చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. అంతేకాదు ఈ హ‌త్య‌లో ఆ పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును ఏ1  ముద్దాయిగా బీజేపీని ఏ2 ముద్దాయిగా చేర్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇదే క్ర‌మంలో ఈ దాడిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు రేపు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు వైసీపీ నాయ‌కులు. తాజా మాజీ ఎంపీల‌తో స‌హా సీనియ‌ర్ నేత‌లంతా ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర‌ప‌తిని, కేంద్ర హోం మంత్రిని క‌లిసి జ‌గ‌న్ పై దాడి ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేయ‌నున్నారు. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ నాయ‌కులు వేసిన సిట్ విచార‌ణ‌పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని అందుకే తాము ఢిల్లీకి బ‌య‌ల్దేరుతున్నామ‌ని వైసీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. 

షేర్ :

Comments

0 Comment