కొత్త ఆలోచ‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr congress party flag
Updated:  2018-04-14 06:30:54

కొత్త ఆలోచ‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే..అయితే ఇప్ప‌టికే అధినేత జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు పార్ల‌మెంట్ చివ‌రి రోజున స్పీక‌ర్ సుమిత్రా మ‌హ‌జ‌న్ స‌భ నిర‌వ‌ధిక వాయిదా వేయ‌డంతో  వైసీపీ ఎంపీలు త‌మ రాజీనామా ప‌త్రాల‌ను స్పీక‌ర్ కు స‌మ‌ర్పించారు... రాజీనామా ప‌త్రాల‌ను స్పీక‌ర్ కు స‌మ‌ర్పించిన వెంట‌నే వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో ప్రాణాలను  సైతం లెక్క‌చేయ‌కుండా ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే.
 
ఇక తాజాగా ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన‌ట్లు, ఎమ్మెల్యేలు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసే దిశ‌గా ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.. ఇదే విష‌యాన్ని  కొంద‌రు పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ జ‌గ‌న్ దగ్గ‌ర వెళ్లి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.. అయితే దీనిపై జ‌గ‌న్ కూడా సానుకులంగా స్పంధించిన‌ట్లు తెలుస్తోంది.
 
ఒక వేళ వైసీపీ ఎమ్మెల్యేలంద‌రు క‌లిసి మూకుమ్మ‌డిగా  రాజీనామా చేస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌త్యేక హోదా పోరు ఇంకా బ‌లం చేకూర్చుతోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలుపుతున్నాయి.. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నార‌నే  స‌మాచారం ఆనోటా ఈనోటా పాక‌డంతో ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు..ప్ర‌త్యేక హోదా కోసం ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌లేని విధంగా వైసీపీ నాయ‌కులు ఉద్య‌మం  చేస్తున్నార‌ని, వారు ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా పోరాటం చేస్తున్నార‌ని ప‌లు చోట్ల ప్ర‌జ‌లు వైసీపీ నాయకులు  హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.