బ్రేకింగ్ రాజీనామాల‌కు సిద్ద‌మైన వైసీపీ ఎమ్మెల్మేలు తొలిసంత‌కం ఆ ఎమ్మెల్యేదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-28 15:11:25

బ్రేకింగ్ రాజీనామాల‌కు సిద్ద‌మైన వైసీపీ ఎమ్మెల్మేలు తొలిసంత‌కం ఆ ఎమ్మెల్యేదే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని టీడీపీ నాయుకులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌పై నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ఇక వారితో పాటు అధికార నాయ‌కులు కూడా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో విమర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక విమ‌ర్శ‌లు నేప‌థ్యంలో తాజాగా విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ తెర‌పైకి వ‌చ్చింది. దీంతో వైసీపీ నాయ‌కులు ఉక్కును డిమాండ్ చేస్తూ కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా జిల్లా వ్యాప్తంగా దీక్ష‌లు చేస్తున్నారు. ఇటీవ‌లే వైసీపీ ఎమ్మెల్యేలంద‌రూ దీక్ష‌లో భాగంగా క‌డ‌ప ఉక్కు సాధ‌న కోసం మూకుమ్మ‌డిగా రాజీనామా చేస్తామ‌ని చెప్పి ఒక్క‌సారిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చారు.
 
అయితే ఈ క్ర‌మంలో అధికార తెలుగు దేశంపార్టీ నాయ‌కులు కూడా క‌డ‌ప ఉక్కు సాధ‌న కోసం నిరాహార దీక్ష‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ రెండు పార్టీ నాయ‌కులు స్టీల్ ప్లాంట్ పోరాటం ఉధృతం కావ‌డంతో వైసీపీ నాయ‌కులు రాజీనామా చేస్తామ‌ని స‌భా ముఖంగా రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 
ఆయ‌న‌తో పాటు ఇటీవ‌లే నిరాహార దీక్ష చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి కూడా క‌డ‌ప ఉక్కు కోసం వైసీపీ ఎమ్మెల్యేలు అంద‌రూ రాజీనామా చేస్తే తాను తొలిసంత‌కం చేస్తాన‌ని రాచ‌మల్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే త‌మ‌తో పాటు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంద‌రు రాజీనామా చేస్తారా అని స‌వాల్ విసిరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.