మిథున్ రెడ్డి ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 18:43:44

మిథున్ రెడ్డి ఫైర్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న తిరుమ‌ల ఆచార సంప్ర‌దాయాల‌ను మార్చేస్తున్నార‌ని,ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిప‌డ్డారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం రాజ‌కీయాల‌కు అతీత‌మైన‌ ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్ర‌మ‌ని, అటు వంటి పుణ్య‌క్షేత్రంలో చంద్ర‌బాబు త‌న స్వార్థ రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తున్నార‌ని మిథున్ రెడ్డి ఆరోపించారు.
 
ఈ సంర్భంగా ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ, ఎప్పుడు జ‌రుగ‌ని విధంగా తిరుప‌తి పుణ్య‌క్షేత్రంలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఘోరాలు జ‌ప‌రుగుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలకు అధికార నాయ‌కులు ఎందుకు స‌మాధానం చెప్పకున్నార‌ని మిథున్ రెడ్డి ప్ర‌శ్నించారు.  
 
చంద్ర‌బాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పుట్టి తిరుప‌తిలో చ‌దువుకున్న వారే క‌దా ఆయ‌న‌కు తిరుమ‌ల సంప్ర‌దాయం ఎలా ఉంటాయే తెలియ‌దా అన్ని మిథున్ రెడ్డి మండిప‌డ్డారు. అయిదు సంవ‌త్స‌రాల అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం చంద్ర‌బాబు తన ఉక్కుపాదాన్ని బ్రాహ్మణులపై మోపుతున్నారన్నారని మిథున్ రెడ్డి మండిప‌డ్డారు. గ‌తంలో ఏవిధంగా అయితే  విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక‌ పూజలు జ‌రిపించారో అలాంటివే శ్రీవారి ఆలయంలో జ‌రిపించ‌నున్నార‌ని, అయితే వాటిని అర్చకులు చెబుతారనే ఉద్దేశ్యంతో చంద్ర‌బాబు అర్చ‌కుల‌ను తీసేశారని ఆరోపించారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.