వైసీపీలోకి న‌లుగురు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 16:19:19

వైసీపీలోకి న‌లుగురు ?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ కు ముందు నుంచి  వెన్నంటి ఉండే సీనియ‌ర్ లీడ‌ర్, వైసీపీ ఎంపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి పేరు త‌ల‌చుకుంటే తెలుగుదేశం నాయ‌కుల‌కు కొత్త భ‌యం ప‌ట్టుకుంది.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న చేసిన కామెంట్లు ఇప్ప‌టికే తెలుగుదేశానికి 70 ఎం ఎం రేంజ్ లో క‌నిపిస్తున్నాయి..రాజ‌కీయాల‌కు సీఎంకు మంత్రుల‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు  లాబీయింగ్ చేస్తున్న అధికారుల  పేర్ల‌ను ఆయ‌న బ‌య‌పెట్ట‌డంతో వెంట‌నే స‌ద‌రు అధికారులు కూడా సైలెంట్ అయ్యారు.
 
వారు నోరు మెదిపితే 20  ఛాన‌ళ్ల‌కు, అన్ని మీడియాల‌కు  ఆ అధికారులు చేసిన బండారం అంతా బ‌య‌ట‌పెడ‌తా అని ,త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయి అని ఆయ‌న ప‌లికిన మాటలు ఇప్ప‌టికీ బ్యూరో క్రాట్స్ గుర్తు చేసుకుంటున్నారు. విజ‌య‌సాయిరెడ్డి ద‌గ్గ‌ర ఉన్న‌సాక్ష్యాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా?  తెలుగుదేశం ప్లాన్ బ‌ట్టి వెళ‌దాం అని అనుకున్నారు... అందుకే మూడో వ్య‌క్తి నిల‌బ‌డి ఉంటే క‌చ్చితంగా ఆయ‌న సాక్ష్యాధారాలు బ‌య‌ట‌పెట్టేవారు అని ఆనాడే అంద‌రూ చర్చించుకున్నారు.
 
ఇక తాజాగా ఆయ‌న చేసిన కామెంట్లు కూడా ప‌లువురు తెలుగుదేశం నాయ‌కులు ఎస్ అంటున్నారు.. గ‌త ఎన్నిక‌ల్లో ఎలా గట్టెక్కామో తెలియ‌దు అని, అయితే జ‌గ‌న్ పై అక్క‌సా లేక తెలుగుదేశం పై వ‌చ్చిన మ‌క్కువా  తెలియ‌దు కాని 22 మంది ఫిరాయించారు.. అయితే  ఎందుకు పార్టీ ఫిరాయించామా అని ఆలోచిస్తున్నారు ఆ నాయ‌కులు... అయితే మంత్రి ప‌ద‌వులు పొందిన వారు మరో ఏడుగురు పార్టీలో ఆధిపత్య పోరు ఎదుర్కొంటున్నా, త‌ప్ప‌క  పార్టీలో కొన‌సాగాలి అని అనుకుంటున్నార‌ట... ఇక మ‌రో ప‌ది మంది వైసీపీలోకి జ‌గ‌న్ ఎస్ అని చెబితే ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారు అని తెలుస్తోంది... అయితే ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కుల‌తో వారు ట‌చ్ లో ఉన్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న కామెంట్లు చేశారు... తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నారు అని ఆయ‌న తెలియ‌చేశారు... అయితే దీనిపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంద‌రు క‌రెక్ట్ అంటున్నారు... అయితే దీనికి ప్ర‌ధాన కార‌ణం పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం, అలాగే వారికి ప్ర‌యారిటీ ఇవ్వ‌డం చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము క‌రివేపాకులు అయ్యేలా ఉన్నాము అని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నార‌ట...
 
న‌లుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైసీపీలో ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నారు అని తెలుస్తోంది... ఇది కాని జ‌రిగితే తెలుగుదేశం అధినేత‌కు ఎటువంటి ప‌రిస్దితి ఎదురు అవుతుందో తెలిసిందే... ఒక‌వేళ వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నా ఫిరాయింపుల‌పై కూడా తీసుకోవాలి ఇది రాజ‌కీయంగా పెను స‌వాల్ లాంటిదే.

షేర్ :

Comments

1 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.