ఎల్లుండి సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 18:39:29

ఎల్లుండి సంచ‌ల‌నం

ప్ర‌తిప‌క్షనేత‌ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగు సంవ‌త్స‌రాలుగా రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌నీ అయిన ప్ర‌త్యేక‌ హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. అయితే ఈ క్ర‌మంలో త‌న ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా జ‌గ‌న్ అమ‌రావ‌తి లో నిరాహార దీక్ష చేయ‌బోతే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏపీకీ ప్ర‌ధాని మోడీ వ‌స్తున్నారంటూ ఈ దీక్ష‌ను భ‌గ్నం చేయించారు. 
 
ఇక ఈ నేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితం పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశాలు రానేవ‌చ్చాయి. ఈ స‌మావేశంలో కూడా వైసీపీ నాయ‌కుల్లో ప్ర‌త్యేక హోదా జోరు త‌గ్గ‌లేదు. దీంతో జ‌గ‌న్ త‌న‌కున్న ఐదు మంది వైసీపీ ఎంపీల‌తో పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశం రోజున వారితో రాజీనామా చేయించి ఏపీ భ‌వ‌న్ లో ఆమ‌ర‌ణ నిరాహార‌ దీక్ష చేయించిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా వారి రాజీనామాల వ్య‌వ‌హారంపై స్పీక‌ర్ కార్యాలయం నుంచి పిలుపు వ‌చ్చింది. అయితే స్పీక‌ర్ పిలుపు మేర‌కు వైసీపీ ఎంపీలు కొద్ది రోజుల క్రితం స్పీక‌ర్ కార్యాల‌యానికి వెళ్లి సుమిత్ర మ‌హాజ‌న్ ను క‌లిశారు. ఆ త‌ర్వాత త‌మ రాజీనామాల‌ను ఆమోదించాల‌ని వైసీపీ ఎంపీలు కోరారు. అయితే వారి రాజీనామాల‌పై స్పీక‌ర్ సంకోచించారు. స‌భ‌లో తొంద‌ర పాటు నిర్ణయం వ‌ల్లే రాజీనామా చేశారు కాబ‌ట్టి త‌మ రాజీనామాల‌పై ఆలోచించుకోవాల‌ని స్పీక‌ర్ ఆదేశించారు. 
 
అంతే కాదు వారు ఆలోచించుకునేందు సుమిత్ర‌మ‌హాజ‌న్ ఈ నెల 6 వ తేది వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చారు. ఇక స్పీక‌ర్ ఇచ్చిన గ‌డువు మ‌రో రెండు రోజుల్లో ముగియ‌నున్న నేప‌థ్యంలో వైసీపీ ఎంపీలు బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. ఆ త‌ర్వాత‌ తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు. 
 
మ‌రో వైపు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌చ్చితంగా వైసీపీ ఎంపీ రాజీనామాల‌ను స్పీక‌ర్ ఆమోదిస్తార‌ని ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించారు. స్పీక‌ర్ ఆమోదిస్తే క‌చ్చితంగా ఏపీలో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అందుకోసం టీడీపీ నాయ‌కులు సిద్దంగా ఉండాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.

షేర్ :

Comments

1 Comment

  1. Dear sir maaku upaennikalu vadu pedite main general election pettandi pl yevadu untadu yevadu jail ki potaro pl manaku general assembly election kavali and phirayinpu gala mottaniki kuda election pettandi thank you sir

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.