స్పీకర్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు పిలుపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 15:05:32

స్పీకర్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు పిలుపు

ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఆయ‌న‌ ఆదేశాల మేర‌కు వైసీపీ ఎంపీలు  మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు ప‌ద‌వుల‌ను సైతం లెక్క‌చేయ కుండా జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హ‌జన్ కు స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత ఎపీ భ‌వ‌న్ లో  సుమారు ఆరు రోజుల పాటు నిరాహార ఈక్ష‌చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
అయితే గ‌తంలో వైసీపీ ఎంపీల రాజీనామాల‌ను విమ‌ర్శిస్తూ టీడీపీ ఎమ్మెల్యేల‌తో, మంత్రులతో  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన‌ప్పుడు ఎగ‌తాలి చేస్తూ ఎట్టి ప‌రిస్థితిలో వారి రాజీనామాల‌ను లోక్ స‌భ‌లో ఆమోదంపొంద‌వ‌ని, మ‌ళ్లీ ఏపీలో ఉప ఎన్నిక‌లు జ‌రుగ‌వ‌ని ఎద్దేవా చేశారు. ఇక‌ ఇదే విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న వైసీపీ ఎంపీలు త‌మ రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్ ను కోరారు. దీంతో వైసీపీ ఎంపీల నిర్ణ‌యం మేర‌కు లోక్‌ సభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. ఈ నెల 29 తేదిన ఢిల్లీకి వెళ్లి స్పీక‌ర్ కార్యాలయంలో సుమిత్ర మ‌హాజ‌న్ ను క‌లువ‌నున్న‌ట్లు రాజీనామా చేసిన ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.
 
ఈ సంర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తమ రాజీనామాల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితిలో  వెనక్కి తగ్గే ప్ర‌స‌క్తి లేద‌ని మిథున్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అయితే గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు వైసీపీ నాయ‌కులు, బీజేపీతో లాలుచీ చేసుకుని రాజీనామాలు చేశార‌ని అన్నారు.అయితే వైసీపీది లాలుచీ రాజ‌కీయం చేసే త‌త్వం కాద‌ని రాష్ట్ర అభివృద్ది కోసం తాము ఎంత వ‌ర‌కు అయినా పోరాడుతామ‌ని అన్నారు. చంద్ర‌బాబు లాగా రోజుకు ఒక మాట మార్చే వ్య‌క్తిత్వం త‌మ అధినేత జ‌గ‌న్ కు లేద‌ని మిథున్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
ఈ నెల 30 వ తేదీన స్పీకర్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని ఆయ‌న తెలిపారు. త‌మ రాజీనామాల‌ను ఆమోదించిన వెంట‌నే ఏపీలో ఐదు స్థానాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని మిథున్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా వైసీపీ ఎంపీలంద‌రం క‌లిసి త‌మ స‌త్తాను చాటుతామ‌ని మిథున్ రెడ్డి త‌మ ధీమాను వ్య‌క్తం చేశారు. ఇక ఇదే విష‌యాన్నిముఖ్యమంత్రి  చంద్ర‌బాబు నాయుడు కూడా కేబినెట్ స‌మావేశంలో టీడీపీ మంత్రుల‌తో ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.