రాజ‌న్న పాదాల వద్ద రాజీనామా లేఖలు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 15:13:41

రాజ‌న్న పాదాల వద్ద రాజీనామా లేఖలు..

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఈరోజు అమ‌లు జ‌రుగ‌నుంది... వైసీపీ ఎంపీలు నేడు లోక్ స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన వెంటనే త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పించి హూదా పోరాటానికి సిద్దం అయ్యారు ఎంపీలు.
 
హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న ఎంపీలు.. సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను మహానేత వైఎస్సార్‌ పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. త‌ర్వాత పార్ల‌మెంట్ కు చేరుకున్నారు.
 
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇప్ప‌టికే తెలిపారు. ఆ వెంటనే ఏపీ భవన్‌ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు.ఢిల్లీలో దీక్షకు దిగనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి.
 
వైఎస్సీర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఈ మేరకు విద్యార్థులు,యువతకు ఇదివరకే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అటు ఎంపీల దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి మొదలైంది. వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా ఢిల్లీకి పయనం అయ్యారు. ఇక ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు దీక్ష‌ల కోసం సిద్దం అయ్యారు ఇటు ఎంపీల‌కు సంఘీభావం తెలిపేందుకు ప‌లువురు వైసీపీ కేంద్ర నాయ‌క‌త్వం  దిల్లీ చేరుకున్నారు.
 
ఇటు తెలుగుదేశం డ్రామాలు ఆడుతోంద‌ని నిజాయ‌తీగా ఏపీకి ప్ర‌త్యేక హూదా కావాలి అని అనుకుంటే త‌మ‌తో క‌లిసి రాజీనామా  చేయాలి అని వైసీపీ ఎంపీలు తెలుగుదేశానికి పిలుపునిచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.