వైసీపీ ఎంపీలు కీల‌క‌ స‌మావేశం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 16:50:05

వైసీపీ ఎంపీలు కీల‌క‌ స‌మావేశం

ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశం రోజున వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ కు అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రాజీనామాల‌ పై రేపు స్పీక‌ర్ చ‌ర్చించ‌నున్నారు. రాజ్యాంగం ప్ర‌కారం వారు ఎందుకు రాజీనామా చేయాల‌నుకున్నారో స్పీక‌ర్ కు వివ‌రించాలి ఆ త‌ర్వాత స్పీక‌ర్ సంతృప్తి చెందితే వైసీపీ ఎంపీల‌ రాజీనామాను ఆమోదిస్తారు.
 
రేపు వైసీపీ ఎంపీల రాజీనామాల‌పై చ‌ర్చ జ‌రుగ‌నున్న‌ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు క‌లిసి ఈ రోజు సాయ‌త్రం ఢిల్లీలో స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ క‌లువ‌నున్నారు. స్పీకర్‌తో  భేటి కానున్న క్ర‌మంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం ఎంపీలంతా సమావేశం అయ్యారు. 
 
ఈ సంద‌ర్భంగా మేక‌పాటి మాట్లాడుతూ.. తాము ఈ రోజు స్పీక‌ర్ ను క‌లిసి త‌మ రాజీనామాల‌ను ఆమోదించాల‌ని కోరుతామ‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌నీ అయిన ప్ర‌త్యేక హోదా కోసం తాము ఎందాకైనా పోరాడుతామ‌ని మేక‌పాటి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయించ‌కుండా డ్రామాలు ఆడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
టీడీపీ ఎంపీల‌తో రాజీనామా చేయిస్తే ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయే అన్న భ‌యంలో చంద్ర‌బాబు జంకుతున్నార‌ని మేక‌పాటి అన్నారు. 2019 ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అన్నారు. అలాగే వైఎస్ జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారని అన్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. Kalasi vundandi vijayam manade

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.